IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justin Greaves Ruled Out From 2nd ODI vs India: భారత్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 0-1తో వెనుకబడిన వెస్టిండీస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్, సెంచరీ హీరో జస్టిన్ గ్రీవ్స్ గాయం కారణంగా రెండో వన్డే మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాలి కండరం గాయం కారణంగా అతడు కీలక మ్యాచ్‌కు దూరం అయ్యాడు. గ్రీవ్స్ స్థానంలో యువ ఆటగాడు జ్యువెల్ ఆండ్రూను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపే అవకాశాలు ఉన్నాయి. రెండో వన్డే ఈరోజు మధ్యాహ్నం గువాహటిలో జరగనుంది.
తిరువనంతపురంలో జరిగిన తొలి వన్డేలో జస్టిన్ గ్రీవ్స్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరించాడు. 108 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇది అతడి కెరీర్లో తొలి వన్డే సెంచరీ కావడం విశేషం. అయితే ఈ ఇన్నింగ్స్ సమయంలోనే గ్రీవ్స్ కాలి కండరానికి గాయం అయింది. మ్యాచ్ అనంతరం నిర్వహించిన పరీక్షల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో.. రెండో వన్డేకు అతడిని దూరంగా ఉంచాలని వెస్టిండీస్ క్రికెట్ నిర్ణయించింది. గ్రీవ్స్ రెండో వన్డేకు అందుబాటులో ఉండడని క్రికెట్ వెస్టిండీస్ వెల్లడించింది.
Also Read
- Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
తొలి వన్డేలో బ్రాండన్ కింగ్‌తో కలిసి గ్రీవ్స్ తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో వెస్టిండీస్ భారీ స్కోరుకు బలమైన పునాది పడింది. అనంతరం అమీర్ జాంగూ కూడా రాణించడంతో విండీస్ 50 ఓవర్లలో 295/7 పరుగులు చేసింది. అయితే విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 41.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇప్పుడు సిరీస్‌ను సమం చేయాలంటే రెండో వన్డేలో వెస్టిండీస్ తప్పక గెలవాల్సి ఉంది. ఇలాంటి కీలక సమయంలో ఫామ్‌లో ఉన్న గ్రీవ్స్ దూరం కావడం ఆ జట్టుకు పెద్ద లోటుగా మారింది. తొలి వన్డేలో టీమిండియా బౌలర్లపై గ్రీవ్స్ చెలరేగిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?