Jos Buttler: 37 అవార్డులు.. రూ.98 లక్షల ప్రైజ్‌మనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్ 2022 సీజన్‌లో దుమ్మురేపాడు. మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన అతడు 863 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సగటు 57.53గా నమోదైంది. బట్లర్ ఒకవైపు పరుగుల వర్షంతో పాటు అవార్డుల వర్షాన్ని కూడా కురిపించాడు. ఈ సీజన్‌లో బట్లర్ ఏకంగా 37 అవార్డులు అందుకున్నాడు. ఈ అవార్డుల ద్వారా రూ.98 లక్షల ప్రైజ్‌మనీని బట్లర్ తన ఖాతాలో వేసుకున్నాడు.
Kasturi: కేఎల్ రాహుల్ అండర్‌వేర్ యాడ్‌కు సీనియర్ నటి ఫిదా
Also Read
- SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
- Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
బట్లర్ పొందిన అవార్డుల్లో ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, గేమ్ చేంజర్, మ్యాగ్జిమమ్ ఫోర్స్, మ్యాగ్జిమమ్ సిక్సెస్, పవర్ ప్లే ప్లేయర్ వంటి పురస్కారాలు ఉన్నాయి. రూ.60 లక్షలను గెలుచుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచినందుకు రూ.10 లక్షల క్యాష్ రివార్డు లభించింది. ఇక ఈ సీజన్‌లో 45 సిక్స్‌లు, 83 ఫోర్లు కొట్టడంతో మ్యాగ్జిమమ్ సిక్స్‌లు, మ్యాగ్జిమమ్ ఫోర్స్ అవార్డులను దక్కించుకున్నాడు. ఈ లెక్కన పదేసి లక్షల చొప్పున రూ.20 లక్షలు అతడి ఖాతాలో చేరాయి. ఈ సీజన్ గేమ్ ఛేంజర్ అవార్డుతో పాటు పవర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డులను కూడా గెలుచుకున్న బట్లర్ మరో రూ.30 లక్షల నగదును తన ఖాతాలో వేసుకున్నాడు. లీగ్ స్టేజ్‌లో రెండు సార్లు, క్వాలిఫయర్-2లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను బట్లర్ అందుకున్నాడు. వీటి ద్వారా రూ.7 లక్షలు సాధించాడు. వివిధ మ్యాచ్‌ల్లో పవర్ ప్లేయర్, గేమ్ చేంజర్, మోస్ట్ ఫోర్స్, మోస్ట్ సిక్సెస్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్ అవార్డులతో మరో రూ.28 లక్షలు కైవసం చేసుకున్నాడు. ఈ లెక్కన మొత్తం రూ.98 లక్షలను అవార్డుల ద్వారానే సంపాదించాడు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!