Jai Moondra: రెండు మ్యాచ్‌లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
- యువ క్రికెటర్ జై ముంద్రా అద్భుత ప్రదర్శన
- 4 ఓవర్లలో 32 రన్స్ ఇచ్చి మూడు వికెట్స్
- టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jai Moondra Reaction on Player of the Match and Series. భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఐర్లాండ్ యువ క్రికెటర్ జై ముంద్రా అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో టీ20లో తన 4 ఓవర్ల కోటాలో 32 రన్స్ ఇచ్చి మూడు కీలక వికెట్స్ పడగొట్టాడు. మొదటి టీ20లో 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్స్ తీశాడు. రెండు మ్యాచ్‌లలో ఆరంభంలో కీలక వికెట్స్ తీసిన భారత సంతతి ఆటగాడు జైకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. అవార్డులు అందుకున్న అనంతరం జై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. కేవలం రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లకే అవార్డులు, ఈ గుర్తింపు రావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పాడు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టైన భారత్‌పై తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడం జీవితంలో మరచిపోలేని అనుభూతి అని పేర్కొన్నాడు.
ఇంకా ఆ ఫీలింగ్ జీర్ణించుకోలేకపోతున్నా:
‘ఈ అనుభూతిని ఇప్పటికీ పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాను. నా ఆనందాన్ని ఒక్క మాటలో చెప్పడం చాలా కష్టం. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు భారత్. అలాంటి జట్టుపై మనల్ని మనం పరీక్షించుకోవడం అద్భుతమైన అనుభవం. ఎక్కువగా ప్రాథమిక అంశాలపైనే దృష్టి పెట్టాలని ముందే నిర్ణయించుకున్నాను. జట్టు సహచరులు, కోచింగ్ సిబ్బంది అందించిన మద్దతే ఈ విజయానికి కారణం’ అని జై ముంద్రా తెలిపాడు.
Also Read
- Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్ జోరు.. దక్షిణాఫ్రికాపై 6-1 ఘన విజయం
- Rishabh Pant Record: టెస్టుల్లో 100 సిక్సర్లు.. పంత్ పేరిట ప్రపంచ రికార్డు!
- IND vs SL 1st Test: గాలె టెస్ట్‌లో భారత్‌కు షాక్.. రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే చేతులెత్తేశారు..
- Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
కష్టకాలంలో ప్రశాంతంగా ఉండాలి:
తన కెరీర్లో ఎదురైన ఒడిదుడుకుల గురించి మాట్లాడిన జై ముంద్రా.. ప్రతి ఆటగాడి జీవితంలో ఎత్తుపల్లాలు సహజమేనని చెప్పాడు. ‘ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలి. ప్రశాంతంగా ఉండి మన పని మనం చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. నేను కూడా అదే చేశాను’ అని పేర్కొన్నాడు.
ఐర్లాండ్ నన్ను తమవాడిలా చూసుకుంది:
ఐర్లాండ్ జట్టులో తనకు లభించిన ఆదరణ గురించి కూడా జై ముంద్రా స్పందించాడు. ‘నేను భారత్ నుంచి ఇక్కడికి వచ్చా. ఇక్కడ ఎవరూ నన్ను కొత్త వ్యక్తిలా చూడలేదు. అందరూ తమ జట్టు సభ్యుడిగానే భావించారు. అద్భుతమైన వాతావరణం, మంచి మనుషులు, మంచి సహకారం లభించాయి. నాకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడంపైనే దృష్టి పెట్టాను’ అని చెప్పాడు.
సంజూ శాంసన్‌కు బౌలింగ్ చేసేటప్పుడు ఇదే ఆలోచన:
భారత్ స్టార్ బ్యాటర్ సంజు శాంసన్‌కు బౌలింగ్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న జై ముంద్రా.. ‘ప్రణాళికను మార్చకుండా, సాధారణంగా ఎలా బౌలింగ్ చేస్తానో అలాగే చేయాలని అనుకున్నాను. సంజు లాంటి టాప్ బ్యాటర్‌కు బౌలింగ్ చేయడం సులభం కాదు. చిన్న తప్పిదానికే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ప్రణాళికకు కట్టుబడి బౌలింగ్ చేశాను’ అని వెల్లడించాడు.
భారత్‌పై ఈ అవార్డు వస్తుందని ఊహించలేదు:
భారత్‌పై సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకోవడం గురించి జై ముంద్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘భారత్ వంటి బలమైన జట్టుపై ఈ అవార్డు గెలుస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పటికీ అది నిజమేనా అనే భావన నుంచి బయటకు రాలేకపోతున్నాను. ఇది నా కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన క్షణం’ అని భావోద్వేగంగా చెప్పాడు.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!