యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న టీ20 ప్రపంచ కప్ తర్వాత టీ20 ఫార్మటు లో భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్న తన బాధ్యతల నుండి తప్పుకుంటాను అని విరాట్ కోహ్లీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు. అయితే ఆ ఐసీసీ టోర్నీ ముగిసిన తర్వాత భారత హెడ్ హెడ్ కోచ్ రవిశాస్త్రి కుఫా తన బాధ్యతల నుండి తప్పుకొనునట్లు తెలుస్తుంది. దాంతో బీసీసీఐ ప్రస్తుతం కొత్త కోచ్ వేటలో పడినట్లు తెలుస్తుంది. ఇక శాస్త్రి తర్వాత ఆ బాధ్యతలు వీవీఎస్ లక్ష్మణ్ లేదా అనిల్ కుంబ్లేలలో ఎవరో ఒక్కరు చెప్పుతానునట్లు తెలుస్తుంది. అయితే కుంబ్లే గతంలో 2016-2017 మధ్య భారత జట్టు హెడ్ కోచ్ గా ఉన్నాడు. కానీ అప్పుడు కెప్టెన్ కోహ్లీతో వచ్చిన విబేధాల కారణంగా హెడ్ కోచ్ గా తప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అతడినే కోచ్ గా తీసుకురావాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ బాధ్యతలు చేపట్టడానికి బీసీసీఐ దృష్టిలో వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఉన్నట్లు సమాచారం. చూడాలి మరి వీరిలో ఎవరు తర్వాతి టీం ఇండియా హెడ్ కోచ్ అవుతారు అనేది.