TVK Chief Vijay: టీవీకే విజయ్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీ మనతోనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVK Chief Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పొలిటికల్ హీట్ పెంచుతున్న వేళ టీవీకే పార్టీ అధినేత విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు కాంగ్రెస్ పార్టీని సీఎం ఎంకే స్టాలిన్ తన ఆధీనంలోకి తీసుకున్నారని విజయ్ విమర్శించారు. అయితే, నిజమైన కాంగ్రెస్ నేతలు తమతోనే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కూటముల్లో ఉన్న పార్టీలపై సెటైర్లు వేస్తూ, కూటమి భాగస్వాములు తమ ఓట్లను కూడా కాపాడుకోలేకపోతున్నారని విమర్శించారు.
Read Also: India Advisory Iran: “వెంటనే బయలుదేరండి”.. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులకు కీలక హెచ్చరిక..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ఎన్నికల ముందు తనపై తీవ్ర కుట్రలు జరిగాయని విజయ్ ఆరోపించారు. ఎన్నికలకు సుమారు 30 రోజుల ముందు నుంచే తనను లక్ష్యంగా చేసుకుని వివిధ రకాలుగా అణచివేయడానికి ప్రయత్నించారని తెలిపారు. అయినప్పటికీ తనను ఎవరూ ఆపలేకపోయారని చెప్పుతూ, తలపై ఉన్న వెంట్రుకలను చూపిస్తూ వ్యంగ్యంగా స్పందించారు. తనపై రాజకీయంగా ఒత్తిడి తేవడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని, కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన వెనుక ఉన్న నిజాలు అందరికీ తెలుసని విజయ్ అన్నారు. అలాగే తన సినిమా జననాయగన్ విడుదలను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.
ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకు పోలీసులు కూడా ఉపయోగించబడ్డారని విజయ్ విమర్శించారు. అయినప్పటికీ ప్రజలు ఇవేమీ పట్టించుకోకుండా తనకు మద్దతుగా నిలిచారని తెలిపారు. చివరకు తన వ్యక్తిగత జీవితాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించేందుకు తన భార్యతో విడాకుల అంశాన్ని బయటకు తెచ్చారని ఆరోపించారు. ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజలు తనపై నమ్మకం కోల్పోలేదని, ఎప్పటికీ తనతోనే ఉన్నారని విజయ్ స్పష్టం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీశాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..