Rajat Patidar-RCB: మేం గెలవడానికి అర్హులం కాదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ షాకింగ్ కామెంట్స్!
- ముంబై ఇండియన్స్‌పై చివరి బంతికి ఆర్సీబీ విజయం
- ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ షాకింగ్ కామెంట్స్
- మేం గెలవడానికి అర్హులం కాదన్న పటీదార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌పై చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే ఈ విజయానంతరం ఆర్సీబీ కెప్టెన్ రాజత్ పటీదార్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మ్యాచ్ గెలిచినా.. పెద్దగా సంతోషం లేదన్నాడు. నిజం చెప్పాలంటే.. ఈ మ్యాచ్‌లో తాము గెలవడానికి అర్హులు కాదని స్పష్టం చేశాడు. కృనాల్ పాండ్య ఒత్తిడిలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని ఆర్సీబీ కెప్టెన్ ప్రశంసించాడు.
రాయ్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే భారీ షాక్‌లు తగిలాయి. 5.1 ఓవర్లకే 39/3తో కష్టాల్లో పడింది. స్టార్ బ్యాటర్లు త్వరగా అవుట్ కావడంతో ముంబై మ్యాచ్‌పై పట్టు సాధించినట్లు కనిపించింది. అయితే ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య ఒత్తిడిలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 46 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టును విజయానికి దగ్గర చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. ఆర్సీబీ విజయంలో భువనేశ్వర్ కుమార్ (4/23), కృనాల్ కీలక పాత్ర పోషించారు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
మ్యాచ్ అనంతరం రజత్ పటీదార్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి మ్యాచ్‌లు ఇప్పుడు సాధారణమే అయిపోయాయి. కానీ ఇది చాలా టఫ్ గేమ్. ముఖ్యంగా కృనాల్ పాండ్య అసాధారణంగా ఆడాడు. జట్టును ఒత్తిడిలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. కృనాల్‌ను ఐదో స్థానంలో పంపడం జట్టు నిర్ణయమే. అతడికి మంచి అనుభవం ఉంది. ఇలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో అనుభవజ్ఞులే జట్టును గెలిపిస్తారు. ముంబై ఇండియన్స్‌ను 166 పరుగులకే పరిమితం చేయడంలో భువనేశ్వర్ కుమార్ పాత్ర కీలకం. ఈ పిచ్‌పై బంతి అద్భుతంగా వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో భువనేశ్వర్ బంతిపై చూపించిన నియంత్రణ అద్భుతం. అతడిని ఎదుర్కోవడం చాలా కష్టం’ అని చెప్పాడు.
మ్యాచ్ గెలిచిన తర్వాత రజత్ పటీదార్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు చర్చకు దారి తీశాయి. ‘మాకు పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉంది. 166 పరుగుల లక్ష్యాన్ని మేం మరింత సులభంగా ఛేదించాల్సింది. పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇలాంటి లక్ష్యాలను ఈజీగా చేధించే సామర్థ్యం మాకు ఉంది. నిజాయితీగా చెప్పాలంటే.. ఈ మ్యాచ్‌లో మేం గెలవడానికి అర్హులు కాదు అనిపించింది. సాధారణ లక్షాన్ని చివరి బంతి వరకు తీసుకెళ్లాము. ఈ విజయంతో రెండు పాయింట్స్ వచ్చినా.. పెద్దగా ఆనందం లేదు’ అని పటీదార్ తెలిపాడు. పటీదార్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్లేఆఫ్స్ రేసులో మరింత బలంగా నిలిచిన బెంగళూరు.. ఇప్పుడు టాప్-2 స్థానంపై దృష్టి పెట్టింది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!