BCCI-India Coach: ఆస్ట్రేలియా మాజీలకు కౌంటర్.. టీమిండియా కొత్త కోచ్‌పై జై షా హింట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI secretary Jay Shah Slams Ricky Ponting and Justin Langer: టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ చివరితో ముగియనుంది. టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం కొత్త కోచ్ బాధ్యతలు చేపడతాడు. అయితే బీసీసీఐ ఆఫర్ ఇస్తున్నా కోచ్ పదవిని చేపట్టడానికి విదేశీ మాజీ క్రికెటర్లు ఆసక్తి చూపించట్లేదని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కోచ్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపలేమని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. భారత కోచ్‌గా తీవ్ర స్థాయిలో ఒత్తిడి, రాజకీయాలను ఎదుర్కోవాల్సి వస్తుందని జస్టిన్ లాంగర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీలకు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా కౌంటర్ ఇచ్చారు.
టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ఎవరినీ సంప్రదించలేదని జై షా స్పష్టం చేశారు. ‘నేను కానీ, బీసీసీఐ ఆఫీస్ బేరర్లు ఎవరూ కానీ ఏ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ను సంప్రదించలేదు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. హెడ్ కోచ్‌గా సరైన వ్యక్తినే ఎంపిక చేస్తాం. అదంతా ఓ ప్రణాళిక ప్రకారంగా జరుగుతుంది. భారత క్రికెట్ స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వారి కోసం చూస్తున్నాం. అద్భుత నైపుణ్యంతో జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చే వారినే ఎంపిక చేస్తాం. దేశవాళీ క్రికెట్ గురించి పూర్తిగా తెలిసిన వారిని తీసుకొనేందుకు మొగ్గు చూపిస్తాం’ అని జై షా స్పష్టం చేశారు.
Also Read
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
Also Read: Anasuya Bharadwaj: పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాట.. పిక్స్ చూస్తే ‘ఆహా’ అనాల్సిందే!
టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం మే 27 దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు. ఇప్పటి వరకు ఎవరు అప్లై చేశారనేది ఇంకా తెలియరాలేదు. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వైపే బీసీసీఐ ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏడాదిలో పది నెలల పాటు భారత జట్టుతో ఉండటమే అతడికి ఇబ్బందిగా ఉందని సమాచారం. ఈ విషయంలో ఫ్లెమింగ్‌ను ఒప్పించే బాధ్యతను ఎంఎస్ ధోనీపై బీసీసీఐ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పేరు కూడా రేసులో ఉందట. తాను దరఖాస్తు చేయడం లేదని రికీ పాంటింగ్ ఇప్పటికే వెల్లడించాడు. జస్టిన్ లాంగర్ ఈ భారాన్ని మోయలేనని చేతులెత్తేశాడు. జై షా వ్యాఖ్యలను బట్టి భారత నుంచే కోచ్ ఉంటాడని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు