Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
- వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన ఆర్సీబీ
- ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది
- ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkatesh Iyer Reveals Turning Point in RCB IPL 2026 Campaign: ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది.ఆర్సీబీ విజయాల్లో స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ అనంతరం తన కెరీర్లో ఎదుర్కొన్న కఠిన పరిస్థితుల గురించి వెంకీ మనసు విప్పాడు. సోషల్ మీడియాలో ఎదురైన విమర్శలు, ట్రోలింగ్ తనను ప్రభావితం చేశాయని అంగీకరించిన వెంకటేశ్.. వాటికి స్పందించకుండా తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చానని తెలిపాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన వెంకటేశ్ అయ్యర్.. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ 2026 వేలంలో ఆర్సీబీ అతడిని రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది. కొత్త జట్టులోకి వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో విమర్శలు కొనసాగినప్పటికీ.. వెంకీ తన ఆటపై దృష్టి పెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెంకటేశ్.. ‘సోషల్ మీడియా విమర్శలు నన్ను ప్రభావితం చేయలేదని చెబితే అది అబద్ధం అవుతుంది. అవి ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయి. కానీ వాటికి నేను ఎప్పుడూ స్పందించలేదు. ఇది నా జీవితం, నా కెరీర్. దానికి పూర్తి బాధ్యత నాదే. నేను బాగా ఆడనప్పుడు నాకు తెలుస్తుంది. దాన్ని ఇతరులు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ గురించి నాకు అవగాహన ఉంది’ అని చెప్పాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ అనేవి క్రీడాకారుల జీవితంలో భాగమని వెంకటేశ్ అభిప్రాయపడ్డాడు. ‘బాగా ఆడినా ప్రజలు మాట్లాడతారు, బాగా ఆడకపోయినా మాట్లాడతారు. మనం నియంత్రించగలిగేది మన కృషి, మన వైఖరి మాత్రమే. ముఖ్యంగా మన దృక్పథాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. నేను అదే చేయడానికి ప్రయత్నించాను’ అని తెలిపాడు. ఆర్సీబీ జట్టు వాతావరణం తనకు ఎంతో సహాయపడిందని వెంకటేశ్ పేర్కొన్నాడు. ‘ఆర్సీబీ జట్టులో నేను ఒంటరిగా ఉన్నాను అనే ఫీలింగ్ రాలేదు. నేను ఈ జట్టులో భాగం కాదనే భావన కూడా రాలేదు. పూర్తిగా ఇంట్లో ఉన్నట్లే అనిపించింది. అదే నాకు ముందుకు సాగే శక్తిని ఇచ్చింది’ అని చెప్పాడు.
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ తన కెరీర్లో కీలక మలుపుగా మారిందని వెంకటేశ్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో గాయంతో కెప్టెన్ రజత్ పాటిదార్ దూరమైన తర్వాత అవకాశం దక్కించుకున్న వెంకటేశ్.. అజేయంగా 73 పరుగులు చేసి మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు తిప్పాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాత జట్టులో తన స్థానం స్థిరపడింది. ఆ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. ‘ఏ బ్యాటర్‌కైనా తొలి 10 బంతులే అత్యంత కీలకం. లెజెండరీ ఆటగాళ్లకైనా అదే వర్తిస్తుంది. మీరు నిరంతరం మ్యాచ్‌లు ఆడితే ఆ ఒత్తిడి తక్కువగా ఉంటుంది. కానీ ఎక్కువ అవకాశాలు రాకపోతే తొలి కొన్ని బంతుల్లోనే మీరు మీ లయను వెతుక్కోవాలి’ అని వివరించాడు.
పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం తనకు ఎంతో ఉపయోగపడిందని వెంకటేశ్ చెప్పాడు. ‘ఆ మ్యాచ్‌లో నేను కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేశాను. అప్పటికే మంచి ఆరంభం లభించింది. అందుకే నేను తొందరపడాల్సిన అవసరం రాలేదు. ఒకసారి బంతి బ్యాట్ మధ్యలో తగలడం ప్రారంభమైతే మిగతా విషయాలన్నీ మర్చిపోతారు. అప్పుడంతా బంతిని ఎలా ఆడాలన్నదే ఆలోచన. అదే క్రికెట్ మ్యాజిక్’ అని పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!