Vaibhav Sooryavanshi: వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు ప్రత్యర్థి ఓనర్ కూడా ఫిదా.. బుడ్డోడి కోసం వచ్చే ఏడాది బిడ్ ఖాయం!
- యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్
- 38 బంతుల్లోనే 93 పరుగులు చేసిన వైభవ్
- బుడ్డోడి కోసం వచ్చే ఏడాది బిడ్ ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LSG owner Sanjiv Goenka applauded Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన దూకుడైన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. మంగళవారం జైపూర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 38 బంతుల్లోనే 93 పరుగులు చేసి రాజస్థాన్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ప్లేఆఫ్స్ రేసులో కీలకమైన ఈ మ్యాచ్‌లో వైభవ్ ఆడిన విధానం చూసి.. స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ప్రత్యర్థి జట్టు యజమాని సంజీవ్ గోయెంకా కూడా యువ బ్యాటర్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయ్యారు.
వైభవ్ సూర్యవంశీ సెంచరీని తృటిలో మిస్ అయినా.. అతడు ఆడిన విధానం అభిమానులను ఉర్రూతలూగించింది. 10 భారీ సిక్సర్లు, 7 ఫోర్లతో లక్నో బౌలర్లపై బుడ్డోడు విరుచుకుపడ్డాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా స్వయంగా మైదానంలోకి వచ్చి వైభవ్‌తో మాట్లాడారు. బాగా ఆడావ్ అంటూ అభినందించారు. కొద్దిసేపటికే గోయెంకా సతీమణి అక్కడికి వచ్చారు. ఆమెను పరిచయం చేస్తుండగా.. వైభవ్ వెంటనే ఆమె పాదాలకు నమస్కరించాడు. చిన్న వయసులోనే అతడు చూపించిన సంస్కారం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
మ్యాచ్ అనంతరం భారత దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సంజీవ్ గోయెంకా త్వరలోనే ఈ కుర్రాడి కోసం బిడ్ వేయబోతున్నాడేమో’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వైభవ్ బ్యాటింగ్ చూసి ప్రత్యర్థి జట్లు కూడా అభిమానులుగా మారిపోతున్నాయని సన్నీ అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో తొలుత కొంత సమయం తీసుకుని ఆడిన వైభవ్.. తర్వాత పూర్తిగా గేర్ మార్చాడు. వైభవ్‌కు ధ్రువ్ జురెల్ అద్భుత సహకారం అందించాడు. జురెల్ 38 బంతుల్లో 53 పరుగులు చేసి మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు తిప్పాడు. ఇద్దరూ కలిసి లక్నో బౌలర్లను చితక్కొట్టడంతో 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం 19.1 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. ఈ విజయంతో రాజస్థాన్ ప్లేఆఫ్స్ ఆశలను మరింత బలపరుచుకుంది.
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!