Vaibhav Sooryavanshi: నేను ఆ మూడింటి పైనే ఫోకస్ చేస్తా.. ప్రత్యర్థి బౌలర్లు ఏం ప్లాన్ చేసినా నాకు అనవసరం!
- వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్
- సెంచరీలు మళ్లీ మళ్లీ వస్తాయి కానీ ట్రోఫీ రాదు
- ప్రత్యర్థి బౌలర్లు ఏం ప్లాన్ చేసినా నాకు అనవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi Reveals His Match Preparation: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సులతో 97 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. బుధవారం న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన వైభవ్.. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)ను క్వాలిఫయర్-2కు చేర్చాడు. ముందుగా రాజస్థాన్ 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేయగా.. ఛేదనలో సన్‌రైజర్స్ 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన బుడ్డోడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాను వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచించనని, తన దృష్టి మొత్తం జట్టును ఛాంపియన్‌గా నిలపడం పైనే ఉంటుందని వైభవ్ స్పష్టం చేశాడు. ప్రత్యర్థి బౌలర్లు ఏం ప్లాన్ చేసినా తనకు అనవసరం అని, నార్మల్ క్రికెట్ ఆడుతాముందుకు సాగుతా అని చెప్పుకోచ్చాడు. ‘మేము మ్యాచ్ గెలిస్తే ఆ పాజిటివ్ ఇంటెంట్‌ను అలాగే ముందుకు తీసుకెళ్తాం. గతం గురించి ఎక్కువగా ఆలోచించకుండా నెక్స్ట్ మ్యాచ్‌పై దృష్టి పెడతాం. ఇదే విధంగా తర్వాతి మ్యాచ్ కూడా గెలిచి ఫైనల్‌కు చేరాలని భావిస్తున్నాం. తదుపరి మ్యాచ్ గురించి ఆలోచిస్తాను కానీ మరీ ఎక్కువగా కాదు. ప్రస్తుతం ఆడుతున్న మ్యాచ్‌పైనే ఫోకస్ పెడతాను. అవసరమైతే నా ఆటలో ఏం మెరుగుపరచుకోవాలో చూసుకుంటాను. కానీ ఓవర్ థింక్ చేయను’ అని తెలిపాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
మ్యాచ్‌కు ముందు తన ప్రిపరేషన్ గురించి కూడా వైభవ్ వివరించాడు. ‘ప్రత్యర్థి జట్టులో ఉన్న బౌలర్లు ఎవరు?, ఈ పిచ్‌పై వారిని ఎలా ఎదుర్కోవాలి?, బౌండరీలు ఎంత పెద్దగా ఉన్నాయి? లాంటి విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తాను. నేను పాజిటివ్ ఇంటెంట్‌తో ఆడితే బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాను. ఎప్పుడూ గేమ్‌ను డామినేట్ చేయాలనుకుంటాను’ అని తెలిపాడు. చిన్న వయసులోనే ఇంత స్పష్టమైన ఆలోచనతో ఆడుతున్న వైభవ్ మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో ఔటైన వైభవ్.. అప్పటివరకు తనకు రికార్డు గురించి అసలు తెలియదని చెప్పాడు. ‘నేను ఔటైన తర్వాతే సెంచరీకి దగ్గర్లో ఉన్నానని తెలిసింది. ఆ సమయంలో నా ఫోకస్ మొత్తం జట్టుకు ఎంత ఎక్కువగా సహాయం చేయగలనన్న దానిపైనే ఉంది. సెంచరీలు మళ్లీ మళ్లీ వస్తాయి. కానీ ప్రస్తుతం మా లక్ష్యం ట్రోఫీ గెలవడం. అదే నాకు ముఖ్యం’ అని స్పష్టం చేశాడు. ప్రత్యర్థి జట్లు తన కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయన్న విషయంపై కూడా వైభవ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘ప్రత్యర్థి ఏమి ప్లాన్ చేస్తుందో నేను ఆలోచించను. అది వాళ్ల పని. నేను నా ప్లాన్‌పైనే దృష్టి పెడతాను. సాధారణ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాను’ అని తెలిపాడు. క్వాలిఫయర్-2లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తే ఆర్ఆర్ ఫైనల్‌కు చేరడం ఖాయం.
తాజావార్తలు
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?