Jofra Archer Tweet: జోఫ్రా ఆర్చర్ 12 ఏళ్ల క్రితమే ఊహించాడా?.. వైభవ్ సూర్యవంశీ 97పై ట్వీట్ వైరల్!
- రోజురోజుకీ పెరుగుతోన్న వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
- ఎలిమినేటర్ మ్యాచ్‌లో 29 బంతుల్లో 97 పరుగులు
- వైభవ్ సూర్యవంశీ 97పై ట్వీట్ వైరల్
- జోఫ్రా ఆర్చర్ 12 ఏళ్ల క్రితమే ఊహించాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jofra Archer Tweet about Vaibhav Sooryavanshi 97: ఐపీఎల్ 2026లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం రోజురోజుకీ మరింత పెరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల ఈ బుడ్డోడు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 29 బంతుల్లో 97 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచాడు. 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్లతో చెలరేగిన వైభవ్.. రాజస్థాన్‌ను 243 పరుగుల భారీ స్కోర్ దిశగా నడిపించాడు. అనంతరం జోఫ్రా ఆర్చర్ అద్భుత బౌలింగ్‌తో ఎస్ఆర్హెచ్ను 196 పరుగులకే కట్టడి చేయడంతో.. రాజస్థాన్ క్వాలిఫయర్-2కు ఈజీగా అర్హత సాధించింది.
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర విషయం వైరల్‌గా మారింది. రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 12 ఏళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 2014 ఆగస్టు 4న ఆర్చర్ తన ఎక్స్ ఖాతాలో ’97? WTF’ అంటూ ఓ పోస్ట్ చేశాడు. ఆ ట్వీట్ ఏ సందర్భంలో చేశాడో స్పష్టత లేకపోయినా.. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ 97 పరుగుల ఇన్నింగ్స్ తర్వాత ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. ‘ఆర్చర్ 12 ఏళ్ల క్రితమే ఊహించాడా?’, ‘ఆర్చర్ అప్పుడే వైభవ్ ఇన్నింగ్స్‌పై జోస్యం చెప్పాడా?’ అంటూ అభిమానులు, నెటిజెన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
జోఫ్రా ఆర్చర్ ఇలా ట్వీట్స్ చేయడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా చాలా ట్వీట్స్ ఇలానే వైరల్ అయ్యాయి. ఈ ట్వీట్స్ గురించి ఆర్చర్ స్పందిస్తూ.. ‘టీనేజ్‌లో ఉన్నప్పుడు ఏదో సరదాగా పోస్టులు చేసేవాడిని. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి. నాకు చాలా సిల్లీగా ఉంటుంది’ అని చెప్పాడు. వైభవ్ ఇన్నింగ్స్ తర్వాత ఆర్చర్ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆర్చర్, వైభవ్ ఇద్దరూ ఇప్పుడు ఒకే జట్టులో ఉండటం ఈ విషయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. అభిమానులు దీనిని ‘క్రికెట్ మ్యాజిక్’ అంటూ వైరల్ చేస్తున్నారు.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా పేరిట ఉన్న ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం 680 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో కొత్త సూపర్ స్టార్‌గా మారిపోయిన వైభవ్.. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌తో జరిగే క్వాలిఫయర్-2లో కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. వైభవ్ ఈ సీజన్లో ఇప్పటికే 600కు పైగా పరుగులు బాదాడు.
97? Wtf
— Jofra Archer (@JofraArcher) August 4, 2014
తాజావార్తలు
-
iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
-
Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్ప్లే
-
Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!