Urvil Patel: కోచ్ చెప్పాడు, కొట్టాను.. నయా సెన్సేషన్ ఉర్విల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- ఊర్విల్ పటేల్ సంచలన ఇన్నింగ్స్
- 13 బంతుల్లోనే ఊర్విల్ హాఫ్ సెంచరీ
- ఉర్విల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యువ బ్యాటర్ ఊర్విల్ పటేల్ సంచలన ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు. ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించాడు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన బ్యాటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ స్టార్ యశస్వి జైస్వాల్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.
203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఊర్విల్ పటేల్ మెరుపు ఆరంభం అందించాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే భారీ షాట్లతో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపిస్తూ.. కేవలం 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 23 బంతుల్లో 65 పరుగులు చేసి సీఎస్కే విజయానికి బలమైన పునాది వేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఎనిమిది భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. 2023 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై యశస్వి కేవలం 13 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఊర్విల్ కూడా 13 బంతుల్లో ఫిఫ్టీ చేసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. యువ ఆటగాడిగా ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆడిన తీరు అభిమానులను ఆకట్టుకుంది.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి ఊర్విల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నా మనసులో ప్రత్యేకంగా ఏమీ లేదు. మ్యాచ్ పరిస్థితికి, బంతికి తగ్గట్టుగా ఆడాలని మాత్రమే అనుకున్నాను. నాకు స్టేబుల్ బేస్ మెయింటైన్ చేసి షాట్లు ఆడమని కోచ్ చెప్పాడు. నేను అదే చేశాను. మా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పిచ్ కాస్త నెమ్మదిగా ఉందని, అందుకు సిద్ధంగా ఉండమని చెప్పాడు. అంతకంటే ఎక్కువగా ఏమీ చెప్పలేదు. నా ఆటను నేనే ఆడేలా స్వేచ్ఛ ఇచ్చాడు. నేను హాఫ్ సెంచరీ చేయడం, చెన్నై విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. వచ్చే మ్యాచులలో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నిస్తా’ అని ఊర్విల్ పటేల్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 203/8 స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సీఎస్కే 19.2 ఓవర్లలో 208/5 స్కోర్ చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. ఊర్విల్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్ చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించింది.
తాజావార్తలు
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!