Site icon NTV Telugu

Steve Smith: ప్రపంచంలో అతనే బెస్ట్ ప్లేయర్.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ కీలక వ్యాఖ్యలు

Steve Smith

Steve Smith

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2024లో స్టార్ స్పోర్ట్స్ కామేంటేటర్ గా వ్యవహరిస్తున్న అతను.. వ‌ర‌ల్డ్‌క్రికెట్‌లో ఎవరు బెస్ట్ క్రికెటర్ అన్నది చెప్పాడు. గురువారం జరిగిన రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రీ మ్యాచ్ షోలో పాల్గొన్న స్టీవ్ స్మిత్ కు ఓ ప్రశ్న ఎదురైంది.

Read Also: Ravindra Jadeja: వదిన తర్వాత నేనే అయి ఉంటాను.. ధోనీ తనను ఎత్తుకోవడంపై జడ్డూ వ్యాఖ్యలు

వ‌ర‌ల్డ్‌క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట‌ర్ ఎవ‌ర‌న్న ప్రశ్నకు స్మిత్‌.. వెంటనే ఏమీ ఆలోచించ‌కుండానే భార‌త స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి అని చెప్పేశాడు. కోహ్లి ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట‌ర్ అని అన్నాడు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. విరాట్ కోహ్లి వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట‌ర్ అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

Read Also: MP Nandigam Suresh: పేదల పట్ల ఎప్పుడూ చంద్రబాబుకు ప్రేమ లేదు..

బరిలోకి దిగాడంటే.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడమే. తాను క్రీజులో ఉన్నంత సేపు బౌలర్లకు భయమే. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి ఎన్నో అరుదైన ఘ‌న‌త‌ల‌ను సాధించాడు. అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో అత్యధిక సెంచ‌రీలు చేసిన స‌చిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ రికార్డును బ‌ద్దలు కొట్టాడు. కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నాలుగో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌-2024 సీజ‌న్‌లోనూ దుమ్ములేపుతున్నాడు. ఈసారి కప్ కొట్టాలని కసితో కోహ్లీ ఆడుతున్నట్లుగా ఉంది.. అతని ఆట తీరు చూస్తుంటే.

Exit mobile version