Pat Cummins Telugu Dialogues Video Goes Viral: ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లతో విరుచుకుపడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో నేడు తలపడనుంది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీని తమ సొంతగడ్డపైనే ఓడించిన ఎస్‌ఆర్‌హెచ్.. ఉప్పల్‌లోనూ అదే రిపీట్ చేయాలని భావిస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్‌లోనే అత్యధిక స్కోరు (287) సాధించిన కమిన్స్ సేన.. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తమ రికార్డును బ్రేక్ చేయాలని చూస్తోంది. సొంత అభిమానుల మద్దతు కూడా సన్‌రైజర్స్‌కు కలిసిరానుంది. నేడు ఉప్పల్ స్టేడియం మొత్తం ఆరెంజ్ మయం కావడం పక్కా.
ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌ను తన డైలాగులతో ఖుషీ చేశాడు. పోకిరి, పుష్ప సినిమా డైలాగ్స్ చెబుతూ.. ఆర్‌సీబీకి కమిన్స్ వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబందించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ తెలుగు తమ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘ఒక్కసారి కమిట్ అయితే.. నా మాట నేనే వినను’, ‘కమిన్స్ అంటే క్లాస్ కాదు.. మాస్.. ఊరమాస్’, ‘ఎస్‌ఆర్‌హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ’ అంటూ కమిన్స్ తెలుగులో డైలాగ్స్ చెప్పాడు. చివరగా ‘తగ్గేదేలే’ అని అల్లు అర్జున్ స్టయిల్లో చేశాడు. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.
Also Read: Shubman Gill: అందుకే భారీ స్కోర్లు నమోదవుతున్నాయి.. మా తప్పిదాలు కూడా ఉన్నాయి: గిల్
ఆస్ట్రేలియాకు టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డే ప్రపంచకప్ 2024 అందించిన ప్యాట్ కమిన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అయ్యాక ఎస్‌ఆర్‌హెచ్ తలరాత పూర్తిగా మారిపోయింది. గత మూడేళ్లుగా ప్లే ఆఫ్ దరిదాపుల్లోకి రాని ఎస్‌ఆర్‌హెచ్.. కమిన్స్ కెప్టెన్సీలో ఈసారి ఆ దిశగా దూసుకెళుతోంది. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 7 మ్యాచ్‌లు ఆడి 5 మ్యాచ్‌లలో గెలిచింది. మిగిలిన 7 మ్యాచ్‌లలో మూడు గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది. ఐపీఎల్ 2024లో ఇప్పుడు ఎస్‌ఆర్‌హెచ్ హాట్ ఫేవరెట్‌గా ఉంది.
ఓవైపు కెప్టెన్‌గా #OrangeORangeu అనిపిస్తున్నాడు 💪
అది సరిపోదు అన్నట్టు.. ఈ Mass డైలాగ్స్ 💥@patcummins30 మామ.. నువ్వు సూపర్ అంతే! 🤩
చూడండి#TATAIPL
Hyderabad v Bengaluru | రేపు 6 PM నుంచి
మీ #StarSportsTelugu లో#IPLonStar #OrangeORangeu #ProudToBeTelugu pic.twitter.com/wv5IzPZhFe— StarSportsTelugu (@StarSportsTel) April 24, 2024