Objection My Lord : మెగాస్టార్ ప్రశంసలతో ఉప్పొంగిపోతున్న ‘అబ్జెక్షన్ మై లార్డ్’ టీమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (ZEE5) మరో వినూత్నమైన ఒరిజినల్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. విభిన్న కథాంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ సంస్థ నుంచి తాజాగా రాబోతున్న సంచలనాత్మక కోర్ట్ రూమ్ డ్రామా ‘అబ్జెక్షన్ మై లార్డ్’. ‘నోటరీ పరశురాం’ అనేది దీని ట్యాగ్‌లైన్. టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఈ సిరీస్‌లో అనన్య శర్మ, ముఖేష్ రుషి, స్నేహాల్, సమీర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌కు సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వం వహించారు. మొత్తం 7 ఎపిసోడ్లతో రూపొందిన ఈ ఉత్కంఠభరితమైన సిరీస్ జూలై 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఘనంగా ప్రివ్యూ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ సినిమాను మించిన ఉత్కంఠ ఈ సిరీస్‌లో ఉంటుందని తెలిపారు. “జీ5తో నా ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతోంది. ఇది నేను ఈ వేదికపై చేస్తున్న మూడో వెబ్ సిరీస్. వీటితో పాటు ‘డ్రామా జూనియర్స్’ షో కూడా చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. సిరీస్ షూటింగ్ సమయంలో సినిమాలు చేసేదాని కంటే ఎక్కువ కష్టపడ్డాం. కానీ, ఆ కష్టమంతా ఆస్వాదిస్తూ చేశాం. దర్శకుడు సంతోష్ అయ్యప్పన్ ప్రతి సీన్‌ను ఎంతో క్లారిటీతో తెరకెక్కించారు. నిర్మాత రాజ్‌కుమార్ అందించిన సహకారం మరువలేనిది” అని శ్రీకాంత్ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ సిరీస్‌ను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వీక్షించి అభినందించడం తమ టీమ్‌కు లభించిన అతిపెద్ద విజయం అని శ్రీకాంత్ భావోద్వేగంతో వెల్లడించారు. ముఖేష్ రుషి వంటి గొప్ప నటులతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవమని, ప్రతి పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!