Site icon NTV Telugu

Shubman Gill: అంపైర్తో శుభ్‌మన్‌ గిల్‌ గొడవ.. అసలు ముచ్చట ఏమిటంటే..?

Gill

Gill

Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌ రనౌట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ 76 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో అంపైర్లపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ తర్వాత ఈ విషయంపై మాట్లాడుతూ.. తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గనని తేల్చి చెప్పాడు.

Read Also: Tejashwi Yadav: కుల గణనపై ప్రధాని మోడీకి తేజస్వి యాదవ్ లేఖ

అయితే, నాకు, అంపైర్‌కు మధ్య చాలా డిస్కషన్ కొనసాగింది అని గుజరాత్ సారథి గిల్ పేర్కొన్నాడు. జట్టు విజయం కోసం 100 శాతం కృషి చేస్తున్నప్పుడు ఇలాంటివి జరగడం సహజం.. నేను నా వైఖరి నుంచి వెనక్కి తగ్గడం లేదు.. అక్కడ నా ఉద్దేశం ఏంటో క్లియర్ గా చెప్పాను.. ఎస్‌ఆర్‌హెచ్‌పై గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరువ కావడం సంతోషంగా ఉంది.. కానీ, స్కోరు బోర్డును ఎలా ముందుకు తీసుకెళ్లాలో మాకు తెలుసు అన్నాడు. ఈ గ్రౌండ్ లో సిక్స్‌లు కొట్టడం చాలా కష్టం.. టాప్‌ – 3 బ్యాటర్లు రాణించడం ఆనందంగా ఉంది. మున్ముందు మా జట్టు అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని శుభ్‌మన్‌ గిల్ వ్యాఖ్యానించాడు.

Read Also: Tummala Nageswara Rao: అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదు..

ఇక, శుభ్‌మన్‌ గిల్ 38 బంతుల్లో 76 రన్స్ చేసి సెంచరీ దూసుకుపోతున్న వెళ్తోన్న అతడిని రనౌట్ నిర్ణయం డగౌట్ బాట పట్టాల్సి వచ్చింది. హర్షల్‌ పటేల్‌ విసిరిన త్రోను క్లాసెన్‌ అందుకునే ప్రయత్నం చేయగా.. బంతి గ్లవ్స్‌ను తాకి స్టంప్‌ పక్క నుంచి వెళ్లింది.. ఆ సమయంలో అతడి గ్లవ్‌ స్టంప్‌ను తాకడంతో బెయిల్స్‌ పైకి లేచాయి. చాలాసేపు రీప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్‌ గిల్‌ ఔట్‌ అని ప్రకటించాడు. రివ్యూలో బంతి స్టంప్‌ను తాకినట్లు కానీ, బంతి క్లాసెన్‌ చేతిలో ఉండగా గ్లవ్‌ స్టంప్‌ను కొట్టినట్లు క్లియర్ గా లేకపోయినా.. అంపైర్‌ ఔటివ్వడం ఆశ్చర్యపరిచింది.. దీంతో గుజరాత్‌ కెప్టెన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానం నుంచి బయటికి వస్తూ అక్కడున్న అంపైర్‌తో గొడవకు దిగాడు. అంపైర్‌తో వాగ్వాదం చేసినందుకు గిల్‌పై భారీగా జరిమానా పడే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Exit mobile version