Sanju Samson vs Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్ జట్టులో అంతర్గత పోరు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ సంజూ శాంసన్ల మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి కారణం సూపర్ ఓవర్ ఫలితమని సమాచారం.ఐపీఎల్ 2025 సీజన్లో తొలి సూపర్ ఓవర్ రాజస్థాన్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఈ సూపర్ ఓవర్లో బ్యాటింగ్ కు రియాన్ పరాగ్, హెట్మయెర్ తొలుత బ్యాటింగ్ కు వచ్చారు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్‌ను రెండో వికెట్‌గా పంపించారు. ఇక, ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్‌తో కేవలం 11 పరుగులే ఇచ్చాడు. ఛేజింగ్ లో కేఎల్ రాహుల్ (7), స్టబ్స్ (6) పరుగులు చేయడంతో ఢిల్లీ సూపర్ విక్టరీ సాధించింది.
Read Also: Banana Price: అరటి ధరలకు రెక్కలు.. ఎన్నడూలేనంతగా అత్యధిక ధర! ఐదు నెలల పాటు నో డోకా
అయితే, సూపర్ ఓవర్‌కు ముందు కోచ్ రాహుల్ ద్రవిడ్ జట్టు సభ్యులతో మాట్లాడుతూ కనిపించాడు. ఈ మీటింగ్ కు కెప్టెన్ సంజూ శాంసన్ దూరంగా ఉన్నాడు.. దగ్గరకు రమ్మని పిలిచిన అతడు వెళ్లలేదు. రియాన్ పరాగ్ ను హైలెట్ చేయడానికే ద్రావిడ్ కష్టపడుతున్నాడు.. అందుకే సంజూని ఇలా అవమానిస్తున్నాడని సోషల్ మీడియాలో అతడి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక, సంజూ శాంసన్ ను కెప్టెన్సీని వదిలేయమని సూచించడంతో పాటు జట్టును మారిపోవాలని వేడుకుంటున్నారు.
Read Also: Israel-Hamas: గుడ్‌ఫ్రైడే రోజున హమాస్ కీలక ప్రకటన
ఇక, రాహుల్ ద్రవిడ్‌తో సంజూ శాంసన్ కు ఎప్పుడూ సమస్యగానే ఉంది.. టీమిండియాలో ఉన్నప్పుడూ కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా సంజూ ఆ ఫ్రాంచైజీని వదిలేయ్.. అక్కడ విలువ లేనప్పుడు ఉండటం వృథా.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున మేం ఆహ్వానిస్తున్నాం.. ఇక్కడ నీకు మంచి భవిష్యత్త్ ఉంటుందని అభిమానులు పేర్కొన్నారు.
Leave that franchise Sanju
You're welcome to CSK— AK (@__AK__47) April 17, 2025
https://twitter.com/rs_3702/status/1912915158344802422