Sanju Samson Out: అంపైర్‌తో గొడవ.. క్రీజ్‌ను వీడేందుకు ససేమిరా అన్న సంజూ శాంసన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson argues with filed umpire after controversial dismissal in DC vs RR: అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. 222 పరుగుల భారీ ఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులే చేయగలిగింది. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (86; 46 బంతుల్లో 8×4, 6×6) అద్భుతంగా బ్యాటింగ్ చేసినప్పటికీ.. అతడికి అండగా నిలిచే బ్యాటర్ కరువయ్యాడు. దాంతో సంజూ పోరాటం వృధా అయింది. అయితే ఈ మ్యాచ్‌లో సంజూ అవుట్ అయిన తీరు వివాదాస్పదంగా మారింది. అసంతృప్తికి గురై ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.
222 పరుగుల భారీ లక్ష్య చేధనలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ధాటిగా ఆడాడు. 28 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన సంజూ.. అనంతరం మరింత ధాటిగా ఆడాడు. అదే ఊపులో సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే ముఖేష్ కుమార్ వేసిన 16వ ఓవర్‌లోని నాలుగో బంతిని సంజూ భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద షై హోప్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అయితే బంతిని అందుకునే క్రమంలో షై హోప్ బౌండరీ లైన్‌కు తాకినట్లు రీప్లేలో అనిపించింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: DC vs RR: తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించిన యుజ్వేంద్ర చహల్!
ఇది చూసిన సంజూ శాంసన్.. ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. తాను అవుట్ కాదంటూ.. క్రీజ్‌ను వీడేందుకు నిరాకరించాడు. గురై అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. చివరకు ఫీల్డ్ అంపైర్లు సర్దిచెప్పడంతో పెవిలియన్ చేరక తప్పలేదు. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్, మేనేజ్మెంట్ కూడా ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రిప్లేలను పదే పదే చూపించడంతో కాసేపు హైడ్రామా చోటు చేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!