MI Coach Paras Mhambrey: ఆందోళన ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీని అలా బుట్టలో వేస్తాం!
- గౌహతిలో తలపడనున్న ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్
- భారత్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ పైనే అందరి కళ్లు
- ప్రపంచ టాప్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఎలా ఎదుర్కొంటాడో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఈరోజు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు భారత్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు అతడు ఎదుర్కొనేది.. టీమిండియా పేసు గుర్రం, ప్రపంచ టాప్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను. సునాయాసంగా సిక్సులు బాదే వైభవ్.. బుమ్రా బౌలింగ్‌లో ఎలా ఆడుతాడన్నది ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ నేపథ్యంలో ముంబై బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే మాట్లాడుతూ..వైభవ్ ఆట తమకు కొత్తేం కాదని, అతడి కోసం ప్రత్యేక వ్యూహాలు ఉన్నాయని చెప్పాడు.
ఎంఐ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే మాట్లాడుతూ… ‘వైభవ్ సూర్యవంశీ కొత్త ఆటగాడు కాదు. ఇది అతని రెండో ఐపీఎల్ సీజన్. వైభవ్ మంచి ప్లేయర్ అని మాకు తెలుసు. రాజస్థాన్ ఫ్రాంచైజీకి అత్యంత విలువైన ఆటగాడు. అతడి ఆటతీరు మాకు కొత్త కాదు. వైభవ్ విషయంలో ఆందోళన చెందాల్సిన అసవరం లేదు. మేము ఇతర ఆటగాళ్లలా అతనికీ ప్రత్యేకంగా ప్లాన్ చేశాం. త్వరగానే అవుట్ చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని చెప్పాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Most Expensive Players: కోట్లు కుమ్మరించి కొన్నారు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు!
ఈ మ్యాచ్‌లో ప్రధానంగా అందరి దృష్టి వైభవ్ సూర్యవంశీ, జస్ప్రీత్ బుమ్రా పోరుపై ఉంది. బుమ్రా గురించి మాంబ్రే మాట్లాడుతూ.. ‘బుమ్రా బౌలింగ్‌లో ఉన్న ప్రత్యేకత అతని డెలివరీలు. బ్యాటర్ ఊహించని బంతులు వేస్తుంటాడు. బ్యాట్స్‌మన్ ఏం ఆలోచిస్తున్నాడో అంచనా వేసి.. బంతిని సంధిస్తాడు. అదే అతని ప్రధాన బలం’ అని వివరించాడు. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌పై రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్.. ఆ తర్వాత అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగులతో అదరగొట్టాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో 52, 31 పరుగులు చేసి దూకుడు చూపించాడు. ఆర్ఆర్ జట్టుకు వైభవ్ కీలక ఆటగాడిగా మారాడు.
తాజావార్తలు
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
-
Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
-
Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!