Rohit Sharma Injury Update: ముంబై ఇండియన్స్‌కు షాక్.. రోహిత్ శర్మ అవుట్!
- ముంబై ఇండియన్స్‌కు మరో బిగ్ షాక్
- పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు హిట్‌మ్యాన్ దూరం
- గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం (హామ్‌స్ట్రింగ్ గాయం) కారణంగా ఏప్రిల్ 16న వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రిపోర్టుల్లో హామ్‌స్ట్రింగ్ గాయం తీవ్రమైనదని తేలితే.. ఐపీఎల్ 2026 మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే రోహిత్ గాయంపై ముంబై మేనేజ్‌మెంట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ గాయం కారణంగా మైదానం వీడాల్సి వచ్చింది. జట్టు స్కోర్ 57 పరుగుల వద్ద ఉన్నపుడు హిట్‌మ్యాన్ తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడ్డాడు. ఫిజియో వచ్చి ట్రీట్‌మెంట్ అందించాక.. ఒక బంతిని ఎదుర్కొన్నాడు. ఆపై ఇబ్బందిగా ఉండడంతో హిట్‌మ్యాన్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. ఆపై తిరిగి బ్యాటింగ్‌కు రాలేదు. గాయం నుంచి హిట్‌మ్యాన్ పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. సోమవారం ఉదయం రోహిత్ ఫిజియో నితిన్ పటేల్ పర్యవేక్షణలో స్కాన్లు చేయించుకున్నాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Vaibhav Sooryavanshi Wicket: పక్కాగా ప్లాన్ చేసి.. వైభవ్ సూర్యవంశీని బుట్టలో వేసిన ఆ ఇద్దరు!
ఈ స్కాన్ల ద్వారా రోహిత్ శర్మ గాయం తీవ్రత ఎంత ఉందో ముంబై ఇండియన్స్ వైద్యులు అంచనా వేయనున్నారు. గాయం తీవ్రంగా ఉంటే రోహిత్ కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ముంబై తమ తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 16న పంజాబ్ కింగ్స్‌తో ముంబైలో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ప్రస్తుతం అనిశ్చితంగా మారింది. స్కాన్ రిపోర్టుల ఆధారంగా అతని ఫిట్‌నెస్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. దాదాపుగా కింగ్స్‌పై హిట్‌మ్యాన్ ఆడే అవకాశాలు లేవు. గ్రేడ్-1 గాయంగా తేలితే మాత్రం.. 2-3 వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. ఆ లోగా ఐపీఎల్ చివరి అంకానికి చేరుకుంది. హిట్‌మ్యాన్ గాయంపై ముంబై మేనేజ్‌మెంట్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది. రోహిత్ త్వరగా కోలుకుని జట్టులో చేరాలని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!