Riyan Parag: అహంకారం ఏమీ లేదు.. భారత జట్టుకు తప్పకుండా ఆడతా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Riyan Parag Says Iam going to play for Team India: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రియాన్ పరాగ్ చాలా ఏళ్ల నుంచి ఆడుతున్నా.. గొప్ప ప్రదర్శనేమీ లేదు. అడపాదడపా ఇన్నింగ్స్ మినహా.. వివాదాలతోనే వార్తల్లో నిలిచేవాడు. అయితే ఐపీఎల్ 2024లో అతడు నిలకడగా రాణించి ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున రియాన్ పరాగ్ 14 మ్యాచ్‌ల్లో 573 పరుగులు చేశాడు. 17వ సీజన్లో టాప్ స్కోరర్లలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శన ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో త్వరలోనే తాను భారత జట్టుకు ఆడుతానని పరాగ్ ధీమా వ్యక్తం చేశాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రియాన్ పరాగ్ మాట్లాడుతూ… ‘తప్పకుండా భారత జట్టుకు ఆడతానని ఐపీఎల్లో నేను పెద్దగా పరుగులు చేయనపుడే ఓ ఇంటర్వ్యూలో చెప్పా. అది నాపై నాకున్న నమ్మకం. అలా అన్నానని నాకు అహంకారం ఏమీ లేదు. పదేళ్ల వయసులో క్రికెట్ మొదలుపెట్టినపుడే భారత జట్టుకు ఆడతానని అనుకున్నా. ఏదో ఒక దశలో సెలెక్టర్లు నన్ను భారత జట్టుకు ఎంపిక చేయక తప్పదు. అయితే ఎప్పుడన్నది నాకు తెలియదు. భారత జట్టుకు మాత్రం తప్పకుండా ఆడతా’ అని రియాన్ పరాగ్ చెప్పాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Accident : పూరీలో జగన్నాథుని చందన్ యాత్రలో బాణాసంచా పేలుడు.. 15 మందికి తీవ్ర గాయాలు
ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌లో ఓడిన విషయం తెలిసిందే. రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కు చేరడంలో రియాన్ పరాగ్ కీలక పాత్ర పోషించాడు. కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టుకు అద్భుత విజయాలు అందించాడు. ఈ సీజన్లో 52 సగటు, 149 స్ట్రైక్‌రేటుతో 573 రన్స్ చేశాడు. దాంతో అత్యధిక పరుగులు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా పరాగ్ నిలిచాడు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?