DC vs RR: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ఢిల్లీకి 186 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. రియాన్ పరాగ్ అద్భుతమైన ముగింపుతో రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగలిగింది. ఆఖరి ఓవర్లో రియాన్ పరాగ్ అద్భుతంగా ఆడాడు. నోర్జే వేసిన ఈ ఓవర్లో వరుసగా 4,4,6,4,6,1 బౌండరీలు బాదాడు. కేవలం 45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84 పరుగులు చేశాడు. ఐపీఎల్లో అతడికి ఇదే అత్యధిక వ్యక్తిస్కోర్ కావడం గమనార్హం.
మొదట 3 వికెట్ల నష్టానికి 58 పరుగుల వద్ద రాజస్థాన్ జట్టు కష్టాల్లో పడింది. అనంతరం వచ్చిన రియాన్ పరాగ్ బౌండరీలు బాదడంతో భారీ స్కోరును సాధించగలిగింది. రాజస్థాన్ బ్యాటర్లలో రియాన్ పరాగ్(84), రవిచంద్రన్ అశ్విన్(29), ధ్రువ్ జురేల్(20) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, నోర్జే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లు తలో వికెట్ తీసుకున్నారు.