Riyan Parag: తప్పంతా నాదే, మేం ప్లేఆఫ్స్‌కు అర్హులం కాదు.. రాజస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
- ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఓటమి
- మేం ప్లేఆఫ్స్‌కు అర్హులం కాదు
- రాజస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Riyan Parag Blasts RR After Loss To DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కు ఇది ఆరో ఓటమి. వరుసగా మూడో ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను ఆర్ఆర్ సంక్లిష్టం చేసుకుంది. వరుస పరాజయాలపై రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టు ఆటతీరు పూర్తిగా నిరాశపరిచిందని, ఇలాగే ఆడితే తాము ప్లేఆఫ్స్‌కు అర్హులం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ప్రతి విభాగంలో విఫలమయ్యామని పరాగ్ అంగీకరించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ అనంతరం రియాన్ పరాగ్ మాట్లాడుతూ… ‘నిజం చెప్పాలంటే.. మేం అన్ని విభాగాల్లో విఫలమయ్యాం. 14 ఓవర్ల వరకు మంచి స్థితిలో ఉన్నాం. కానీ నేను ఔటైన తర్వాత మొమెంటమ్ మారిపోయింది. అవకాశాలను సరిగా వినియోగించుకోలేకపోయాం. మేము కనీసం 220-230 పరుగులు చేయాల్సింది. కానీ 193 పరుగులకే పరిమితం అయ్యాం. బౌలింగ్ యూనిట్ కూడా అంచనాలకు తగ్గట్టు ప్రదర్శన ఇవ్వలేకపోతోంది’ అని తెలిపాడు. డొనోవన్ ఫెరెయిరాకు బౌలింగ్ ఇవ్వడంపై వచ్చిన విమర్శలపై పరాగ్ స్పందించాడు. ‘టీవీలో చూస్తే అది గ్యాంబుల్లా అనిపించొచ్చు. కానీ క్రీజులో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నారు. అందుకే డొనోవన్తో ట్రై చేద్దాం అనుకున్నా. శనకతో మరో ఓవర్ వేయించాలనుకోలేదు’ అని వివరించాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఫీల్డింగ్‌పై పరాగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ‘ట్రోఫీ గెలవాలంటే, ప్రతి ఏడాది టైటిల్ కోసం పోటీ పడాలంటే.. మేం ఈరోజు చేసిన దానికంటే ఎంతో మెరుగ్గా ఉండాలి. మా జట్టు సామర్థ్యం దీనికంటే చాలా ఎక్కువ. కానీ గత నాలుగు, ఐదు మ్యాచ్‌లలో మేం అసలు ఆ స్థాయిలో ఆడలేదు. జట్టు ఎనర్జీ, స్కిల్స్, ఎగ్జిక్యూషన్ ఏదీ సరైన స్థాయిలో లేదు. బ్రేక్ తర్వాత మైదానంలో చూపించిన ఆట అసలు సరిపోదు. ఇలాగే ఆడుతూ ఉంటే టాప్-4లో ఉండం’ అని స్పష్టం చేశాడు.
ప్లేఆఫ్స్ అవకాశాలపై కూడా రియాన్ పరాగ్ స్పందించాడు. ‘ఇప్పుడు మేం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తోంది. నాకు అలాంటి పరిస్థితి నచ్చదు. ఇతర జట్లు ఓడిపోతే మేం అర్హత సాధిస్తామనే ఆలోచనతో నేను జట్టుతో మాట్లాడను. మాకు అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని వినియోగించుకోలేకపోయాం. ఒకవేళ ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోతే.. అది పూర్తిగా మా తప్పే’ అని పరాగ్ స్పష్టం చేశాడు. చివరగా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో మెరుగైన ఆటతో గెలవాలని ఆశిస్తున్నట్లు పరాగ్ తెలిపాడు.
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..