RCB vs RR: రాజస్థాన్ చేతిలో ఓటమి.. ఐపీఎల్ 2024 నుంచి బెంగళూరు ఔట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RR fine show to knock RCB out: ఆశలు లేని స్థితి నుంచి అద్భుతమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 4 వికెట్ల తేడాతో ఓడింది. బెంగళూరు నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించింది. యశస్వి జైస్వాల్ (45; 30 బంతుల్లో 8×4), రియాన్ పరాగ్ (36; 26 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. ఈ విజయంతో ఆర్ఆర్ క్వాలిఫయర్-2కు చేరగా.. ఓటమితో బెంగళూరు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫైనల్లో చోటు కోసం శుక్రవారం చెపాక్‌లో సన్‌రైజర్స్‌తో రాజస్థాన్ తలపడుతుంది.
ఎలిమినేటర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. బెంగళూరు ఓపెనర్ల దూకుడుకు ట్రెంట్ బౌల్ట్ కళ్లెం వేశాడు. పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్ (3-0-6-1) చేశాడు. ఫాఫ్ డుప్లెసిస్ (17) ఔట్ అయినా.. పవర్‌ప్లేలో 50 పరుగులు చేసిందంటే అందుకు కారణం విరాట్ కోహ్లీనే. అయితే స్పిన్నర్ల రాకతో బెంగళూరు ఇన్నింగ్స్ నెమ్మదించింది. కెమరూన్ గ్రీన్ (27) పెద్దగా ప్రభావం చూపలేదు. కొద్ది వ్యవధిలోనే కోహ్లీ (33; 24 బంతుల్లో 3×4, 1×6), గ్రీన్ సహా మ్యాక్స్‌వెల్ (0) పెవిలియన్ చేరారు. ఈ సమయంలో రజత్ పటీదార్ (34; 22 బంతుల్లో 2×4, 2×6), మహిపాల్ లొమ్రార్ (32; 17 బంతుల్లో 2×4, 2×6) ఫర్వాలేదనిపించారు. దినేశ్ కార్తీక్ (11) నెమ్మదిగా ఆడినా.. స్వప్నిల్ (9 నాటౌట్) సిక్సర్‌తో స్కోరు 170 దాటింది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Prabhas : ‘బుజ్జి’ పేరు చిన్నగా వున్నా.. మా సినిమాకి ఎంతో స్పెషల్..
ఛేదనలో రాజస్థాన్‌కు తొలి రెండు ఓవర్లలో 6 పరుగులే వచ్చాయి. యశ్ దయాళ్ బౌలింగ్‌లో జైస్వాల్ క్యాచ్‌ను గ్రీన్ అందుకోలేదు. యశ్ వేసిన తర్వాతి ఓవర్లో కాడ్మోర్ (20) ఇచ్చిన క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్ వదిలేశాడు. ఆ వెంటనే స్లో యార్కర్‌తో కాడ్మోర్‌ను ఫెర్గూసన్ బౌల్డ్ చేసినా.. శాంసన్ (17) అండగా జైస్వాల్ బౌండరీలు బాదాడు. గ్రీన్ ఓవర్లో స్కూప్‌కు ప్రయత్నించిన జైస్వాల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే శాంసన్ పెవిలియన్ చేరడంతో బెంగళూరు పోటీలోకి వచ్చింది. కాసేపటికే కోహ్లీ అద్భుత త్రోకు జూరెల్ (8) రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో రాజస్థాన్ విజయ సమీకరణం 30 బంతుల్లో 47 పరుగులుగా మారింది. ఈ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్ హెట్‌మయర్ (26), పరాగ్ బౌండరీలు, సిక్సులు బడడంతో సమీకరణం 18 బంతుల్లో 19 పరుగులుగా మారింది. 18వ ఓవర్లో పరాగ్, హెట్‌మయర్‌ను ఔట్ చేసిన సిరాజ్.. 6 పరుగులే ఇచ్చి ఆశలు రేపాడు. కానీ ఫెర్గూసన్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్‌తో పావెల్ (16 నాటౌట్) మిగతా పని పూర్తి చేశాడు.
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!