గత ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్స్ లో తలపడ్డాయి. అయితే.. ఆ మ్యాచ్ ను విజేతగా నిలపడంలో రవీంద్ర జడేజా ఆడిన ఆటతీరు వల్లే.. చివరి ఓవర్ లో జడేజా బౌండరీలు కొట్టి ఫైనల్ లో గెలిపించాడు. దీంతో.. ఎంఎస్ ధోనీ ఆలింగనం చేసుకుని.. పైకి ఎత్తుకున్నాడు. కాగా.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే..
RCB VS KKR: ఆర్సీబీ పైన షాకింగ్ కామెంట్స్ చేసిన గౌతమ్ గంభీర్ .!
తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో జడేజా గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘సాక్షి (ధోనీ భార్య) వదిన తర్వాత ‘కెప్టెన్ కూల్’ ఎత్తుకొన్న ఏకైక వ్యక్తిని నేనే అయి ఉంటాను’’ అని సరదాగా జడేజా వ్యాఖ్యానించాడు. తమ క్రికెట్ జీవితంలో ఐపీఎల్ 2023 గుర్తుండిపోతుందని తెలిపాడు. ఛాంపియన్‌గా ఐదోసారి టైటిల్‌ను అందుకోవడం చిరస్మరణీయమని జడేజా పేర్కొన్నాడు. అంతేకాకుండా.. గత సీజన్ ఫైనల్‌లో గెలుపొందిన తర్వాత ‘ఈ కప్ కేవలం ధోనీ కోసమే’అని జడేజా అన్నాడు.
Sunil Narine: చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో..
కాగా.. ఈ సీజన్ లో సీఎస్కే ఫ్రాంఛైజీ కొత్త కెప్టెన్ ను నియమించింది. ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కు బాధ్యతలు అప్పజెప్పింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ చెన్నై గెలుపొందిన సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్ ఆర్సీబీతో తలపడగా.. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ పై 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక.. చెన్నై తర్వాతి మ్యాచ్ మార్చి 31న ఢిల్లీతో తలపడనుంది.