Rashid Khan Citizenship: భారత్ పౌరసత్వ ఆఫర్ తిరస్కరణ.. అఫ్గాన్ పట్ల ప్రేమ చాటుకున్న రషీద్ ఖాన్!
- ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్లలో రషీద్ ఖాన్ ఒకడు
- రెండు పెద్ద దేశాల పౌరసత్వ ఆఫర్ల తిరస్కరణ
- అఫ్గాన్ పట్ల ప్రేమ చాటుకున్న రషీద్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashid Khan Citizenship Offer: ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒక్కడైన అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తన దేశంపై ఉన్న అపారమైన ప్రేమను మరోసారి చాటుకున్నాడు. తనకు భారత్, ఆస్ట్రేలియా దేశాల నుంచి పౌరసత్వం (సిటిజన్‌షిప్) ఇస్తామని ఆఫర్లు వచ్చినప్పటికీ.. తాను మాత్రం కేవలం అఫ్గానిస్థాన్ తరఫునే అంతర్జాతీయ క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు. భారత్, ఆస్ట్రేలియా దేశాల నుంచి పౌరసత్వంను సున్నితంగా తిరస్కరించానని రషీద్ వెల్లడించాడు.
‘2023 ఐపీఎల్ సమయంలో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నప్పుడు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)కి చెందిన ఒక ఉన్నతాధికారిని కలిశా. ఆయన ఆహ్వానం మేరకు వెళ్లి ప్రత్యేకంగా కలిశాను. ఆ అధికారి భారత్‌లో స్థిరపడమని సలహా ఇచ్చారు. అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులు బాగాలేవు కాబట్టి భారత్‌కు వచ్చేయాలని చెప్పారు. ఇక్కడ ఉండటానికి కావాల్సిన అన్ని డాక్యుమెంట్లు సమకూరుస్తామని, ఇక్కడే ఉంటూ క్రికెట్ ఆడవచ్చని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదన విని మొదట ఆశ్చర్యపోయాను. అయితే ఎంతో పరిణతితో, నవ్వుతూనే ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించా’ అని రషీద్ ఖాన్ చెప్పాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Shreyas Iyer-PBKS Wis: మా విజయ రహస్యం అదే.. అసలు విషయం చెప్పేసిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్!
‘మీ మద్దతుకు ధన్యవాదాలు. కానీ నేను నా దేశం అఫ్గానిస్థాన్ తరఫునే క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. నా దేశం తరఫున ఆడలేనప్పుడు, మరే ఇతర దేశం కోసం కూడా ఆడను అని చెప్పానని’ అని రషీద్ ఖాన్ వెల్లడించాడు. ఆస్ట్రేలియా ఆఫర్‌ను కూడా ఇలానే తిరస్కరించానని రషీద్ చెప్పాడు. ఈ ఘటనతో తన దేశం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, దేశభక్తి మరోసారి ప్రపంచానికి తెలిసింది. రషీద్ అఫ్గానిస్థాన్ తరఫున 6 టెస్టులు, 117 వన్డేలు, 115 టీ20లు ఆడాడు.
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు