Shreyas Iyer-PBKS Wis: మా విజయ రహస్యం అదే.. అసలు విషయం చెప్పేసిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్!
- ఐపీఎల్ 2026లో ఓటమి ఎరుగని జట్టు పంజాబ్
- ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలవగా, ఓ మ్యాచ్ రద్దు
- పంజాబ్ విజయ రహస్యం చెప్పిన కెప్టెన్ శ్రేయస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సీజన్లో ఓటమి ఎరుగని జట్టు ఏదైనా ఉందంటే.. అది పీబీకేఎస్ టీమ్ మాత్రమే. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలవగా, ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ వరుస విజయాలకు కారణం ఏంటో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. తాను ప్రత్యేకంగా ఎలా ఆడాలనే సూచనలు ఆటగాళ్లకు ఇవ్వనని, వారు తమ శైలిలో ఆడితేనే మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతానని తెలిపాడు. మ్యాచ్‌కు ముందు కోచ్ రికీ పాంటింగ్ ప్రోత్సహిస్తారని, తాను కొన్ని మాటలు చెప్పి జట్టును ఉత్తేజపరుస్తానని శ్రేయస్ చెప్పాడు.
మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మట్లాడుతూ… ‘చాలా సంతోషంగా ఉంది. ప్రియాంశ్ ఆర్య, కూపర్ కనోలీ బాగా ఆడారు. ఇద్దరి భాగస్వామ్యం అద్భుతం. కొన్ని షాట్లు ఆశ్చర్యానికి గురి చేశాయి. ఫాస్ట్ బౌలర్లను బ్యాక్‌ఫుట్‌పై స్ట్రైట్‌గా ఆడటం, స్పిన్నర్లను కూడా అదే ధైర్యంతో ఎదుర్కోవడం అంటే మాటలు కాదు. ధైర్యం, నిలకడ రెండూ అవసరం. ఎందుకంటే మ్యాచ్ ఎప్పుడైనా చేతిలో నుంచి జారిపోవచ్చు. కానీ ఇద్దరు మిడిల్ ఓవర్లలో ఆ భాగస్వామ్యాన్ని నిర్మించిన తీరు అద్భుతం. ఇప్పుడే కూపర్, ప్రియాంశ్‌తో మాట్లాడుతున్నాను. ఈ ఐపీఎల్‌లో ఎవరు ఎక్కువ సిక్సర్లు కొడతారో అనే పోటీ పెట్టుకుందాం అనుకున్నాం. మేమంతా సిద్ధంగా ఉన్నాం. గెలిచిన వారికి నా బ్యాట్ బహుమతిగా ఇస్తాను. వాళ్లు బాగా ఆడినా, నేనూ బాగా ఆడితే నాకు సంతోషమే’ అని చెప్పాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
‘నా అభిప్రాయం ప్రకారం ఆటగాళ్లను స్వేచ్ఛగా వదిలేస్తేనే ప్రతిభను బయటపెడతారు. అదే మా జట్టు మంత్రంగా మారింది. ప్రతి ఒక్కరికి తమ తమ విధానాలు, అలవాట్లు ఉంటాయి. వాటితోన ప్లేయర్స్ ఫలితాలు సాధిస్తున్నారు. కాబట్టి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. మేము మాట్లాడుకుంటాం, మ్యాచ్‌కు ముందు రికీ మోటివేట్ చేస్తాడు. నేనూ కొద్దిగా మాట్లాడుతా. తర్వాత ఆటగాళ్లు మైదానంలో ఫలితం చూపిస్తారు. మా జట్టులో ఉన్న బౌలర్లలో చాలా మంది అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు. వాళ్లు తమ దేశాల తరఫున అద్భుతంగా రాణించారు. అనుభవం కూడా చాలా ఉంది. కాబట్టి వారికి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. మేము కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. ప్రత్యేకంగా కొనరు బ్యాటర్లకు వ్యూహాలు రూపొందిస్తాం. తర్వాత అమలు చేయడమే ముఖ్యం. ఈరోజు వారు బౌలింగ్ చేసిన తీరు, ఈ సీజన్ మొత్తం చూపుతున్న ప్రదర్శన నిజంగా అద్భుతం. ఇలానే కొనసాగాలి. ఇప్పటివరకు అన్నీ బాగా జరుగుతున్నాయి’ అని శ్రేయస్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!