Rajat Patidar History: రజత్ పాటీదార్ అరుదైన ఘనత.. ధోనీ, రోహిత్ సరసన ఆర్సీబీ కెప్టెన్!
- ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ అరుదైన రికార్డు
- ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు సీజన్లలో ఛాంపియన్‌గా ఆర్సీబీ
- ధోనీ, రోహిత్ సరసన ఆర్సీబీ కెప్టెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajat Patidar Joins MS Dhoni and Rohit Sharma in Elite Captains List: ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటీదార్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో వరుసగా రెండు సీజన్లలో జట్టును ఛాంపియన్‌గా నిలిపిన మూడో కెప్టెన్‌గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన కెప్టెన్ల జాబితాలో ఇప్పటివరకు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ మాత్రమే ఉండగా.. ఇప్పుడు పాటీదార్ కూడా వారి సరసన చేరాడు. ప్రస్తుతం పాటీదార్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆర్సీబీ ఫాన్స్ అతడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఐపీఎల్ చరిత్రలో మొదటిసారిగా చెన్నై సూపర్ కింగ్స్‌ను 2010, 2011 సీజన్లలో వరుసగా ఛాంపియన్‌గా నిలిపి ఎంఎస్ ధోనీ ఈ రికార్డును నెలకొల్పాడు. అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 2019, 2020 సీజన్లలో జట్టును వరుసగా టైటిల్ గెలిపించి ఈ జాబితాలో చేరాడు. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 2025, 2026 సీజన్లలో వరుసగా ఛాంపియన్‌గా నిలిపిన రజత్ పాటీదార్.. ఐపీఎల్లో టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసిన మూడో కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్లుగా అత్యధిక టైటిళ్లు గెలిచిన వారిలో ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ధోనీ, రోహిత్ చెరో ఐదు టైటిల్స్ గెలిచారు. 2010, 2011, 2018, 2021, 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ధోనీ ఛాంపియన్‌గా నిలిపాడు. 2013, 2015, 2017, 2019, 2020లో ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ టైటిల్స్ అందించాడు. గౌతమ్ గంభీర్ 2012, 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు టైటిల్స్ అందించాడు. రజత్ పాటీదార్ 2025, 2026లో ఆర్సీబీని విజేతగా నిలిపాడు. షేన్ వార్న్ (రాజస్థాన్ రాయల్స్), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (డెక్కన్ ఛార్జర్), డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), హార్దిక్ పాండ్య (గుజరాత్ టైటాన్స్)లు తలోసారి టైటిల్స్ గెలిచారు.
2025లో ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించిన రజత్ పాటీదార్.. 2026లో మరోసారి జట్టును ఛాంపియన్‌గా నిలిపి ఫ్రాంచైజీ చరిత్రలో స్వర్ణయుగానికి శ్రీకారం చుట్టాడు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత కప్ గెలిచిన బెంగళూరు జట్టు.. ఇప్పుడు వరుసగా రెండు ట్రోఫీలు సాధించి ఐపీఎల్లో కొత్త శక్తిగా అవతరించింది. ఈ విజయంతో పాటీదార్ పేరు ఆర్సీబీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోగా.. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ కెప్టెన్ల సరసన చేరడం అతని కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది.
వరుసగా ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన కెప్టెన్లు:
ఎంఎస్ ధోనీ – 2010, 2011 (చెన్నై సూపర్ కింగ్స్)
రోహిత్ శర్మ – 2019, 2020 (ముంబై ఇండియన్స్)
రజత్ పాటీదార్ – 2025, 2026 (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
తాజావార్తలు
-
OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
-
Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
-
Delhi PUC Rules: వాహనదారులకు అలర్ట్.. PUC గడువు ముగిసిందా? అక్టోబర్ 1 నుంచి రూ.10 వేల వరకు చలాన్
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!