RR vs GT: కదం తొక్కిన జీటీ బౌలర్లు.. తక్కువ స్కోరుకే చాపచుట్టేసిన ఆర్ఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Royals All Out For 118 Against Gujarat Titans: జైపూర్‌లోని సవాయి మాన్సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ బౌలర్లు కదం తొక్కారు. అద్భుతమైన బౌలింగ్ వేసి.. 118 పరుగులకే వారిని కట్టడి చేశారు. అవును.. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగల ఆటగాళ్లున్న ఆర్ఆర్ జట్టు 17.5 ఓవర్లలో కేవలం 118 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఒక్క సంజూ శాంసన్ ఒక్కడే 30 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వాళ్లందరూ ఘోరంగా విఫలమయ్యారు. జీటీ బౌలర్ల ధాటికి.. ఏ ఒక్కరూ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. అందరూ ఇలా వచ్చి, అలా వెళ్లిపోవడమే! బట్లర్, షిమ్రాన్, జురేల్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఈసారి పూర్తిగా చేతులెత్తేశారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రియాన్ పరాగ్.. ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోయాడు.

Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
D Mart : క్యారీ బ్యాగ్‌కు ఛార్జీ విధించిన డి-మార్ట్.. రూ.1,500 జరిమానా
ఆది నుంచే జీటీ బౌలర్లు ప్రతాపం చూపించారు. 11 పరుగుల వద్ద బట్లర్‌ని ఔట్ చేసి.. ఆర్ఆర్పై ఒత్తిడి పెంచారు. బట్లర్ పోయాక యశస్వీ, సంజూ కలిసి కాస్త పరుగుల వర్షం కురిపించారు. కానీ.. అవసరం లేని పరుగు తీసి, యశస్వీ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ దూకుడు మీద ఆడుతూ.. అదే దూకుడులో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇలా వీళ్లిద్దరు ఔటయ్యాక.. ఆర్ఆర్ జట్టు పేకమేడలా కుప్పకూలింది. ఒకరి తర్వాత మరొకరు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ముఖ్యంగా.. స్పిన్నర్లైతే ఆర్ఆర్ పతనాన్ని శాసించారు. రషీద్ ఖాన్ ఏకంగా మూడు వికెట్లతో చెలరేగితే.. నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ, పాండ్యా, లిటిల్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. గుజరాత్ టైటాన్స్‌కు 119 పరుగులు చేయాలి. మరి.. అంత తక్కువ స్కోరుని ఆర్ఆర్ డిఫెండ్ చేయగలదా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?