LSG vs PBKS: లక్నోపై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం.. లాగేసుకున్నారుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab Kings Won The Match Against Lucknow Super Giants: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ఏకన స్పోర్ట్స్ సిటీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్ల తేడాతో మూడు బంతులు మిగిలుండగానే ఛేధించింది. మొదట్లో పంజాబ్ ఆడిన ఆటతీరు చూసి.. ఈ మ్యాచ్ చేజార్చుకుంటుందేమోనన్న అనుమానాలు రేకెత్తాయి. కానీ.. అర్థశతకంతో సికందర్ రజా (57) చెలరేగడం, చివర్లో షారుఖ్ ఖాన్ విజృంభించడంతో పంజాబ్ గెలుపొందింది. ఆ ఇద్దరు ఆటగాళ్లు తాండవం చేసి.. లక్నో నుంచి విజయాన్ని లాక్కున్నారు.
Atik Ahmad: అతీక్ అహ్మద్ హత్య.. మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్తుండగా..
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. లక్నో తరఫున కేఎల్ రాహుల్ ఒక్కడే కెప్టెన్ ఇన్నింగ్స్ (56 బంతుల్లో 74) ఆడాడు. ఓపెనర్‌గా క్రీజులోకి అడుగుపెట్టిన అతగాడు.. చివరివరకు ఒంటరి పోరాటం కొనసాగించాడు. మొదట్లో కైల్ మేయర్స్ (29) అతనికి కొంచెం సహకారం అందించాడు కానీ, మిగతా వాళ్లు మాత్రం చేతులెత్తేశారు. ఏ ఒక్కరూ ఆశాజనకమైన ఇన్నింగ్స్ ఆడకపోవడంతో.. 159 పరుగులకే లక్నో పరిమితం అయ్యింది. ఇక 160 లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి, మ్యాచ్ సొంతం చేసుకుంది.
Raghunandan Rao: రిజర్వేషన్లు ఇవ్వని కేసీఆర్‌కు.. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదు
నిజానికి.. మొదట్లో పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోవడం, స్కోరు కూడా నిదానంగా ముందుకు వెళ్తుండటం చూసి, పంజాబ్ గెలవడం కష్టమేనని అంతా అనుకున్నారు. టాపార్డర్‌తో పాటు స్టార్ ఆటగాళ్లందరూ చేతులెత్తేయడంతో, ఇక పంజాబ్ ఓటమి తథ్యమని భావించారు. అలాంటి సమయంలో సికందర్ రజా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. క్రీజులోకి వచ్చిన మొదట్లో నిదానంగా ఇన్నింగ్స్ ఆడిన ఇతడు, ఆ తర్వాత విజృంభించాడు. ఎడాపెడా షాట్లతో పరుగుల వర్షం కురిపించాడు. ఇక చివర్లో వచ్చిన షారుఖ్ కూడా విధ్వంసం సృష్టించడంతో, పంజాబ్ విజయం సాధించింది.
తాజావార్తలు
-
IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!