Priyansh Arya Fifty: ప్రియాంశ్ ఆర్య సంచలనం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు!

  • ప్రియాంశ్ ఆర్య అరుదైన రికార్డు
  • 16 బంతుల్లో ఆర్య హాఫ్‌ సెంచరీ
  • పంజాబ్ తరఫున రెండో ఫాస్టెస్ట్ హాఫ్‌ సెంచరీ
Priyansh Arya Fifty

Priyansh Arya Fifty

పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో పంజాబ్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్‌ సెంచరీ బాదిన రెండో ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు ముల్లాన్‌పూర్ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్)పై 16 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేయడంతో ప్రియాంశ్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ మ్యాచ్‌లో ప్రియాంశ్ 20 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 57 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు.

పంజాబ్ కింగ్స్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్‌ సెంచరీ బాదిన ఆటగాడిగా భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఇప్పటికీ పంజాబ్ తరఫున అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ రికార్డును రాహుల్ కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో కూడా అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ ఇదే. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ప్రియాంశ్ ఆర్య 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి ఈ జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.

Also Read: Abhishek Sharma History: పవర్‌ప్లేలో పవర్‌ హిట్టింగ్‌.. అభిషేక్‌ శర్మ నయా హిస్టరీ!

ఈ జాబితాలో మూడో స్థానంలో నికోలస్ పూరన్ ఉన్నాడు. 2020లో దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 17 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. ఇక నాలుగో స్థానంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ నిలిచాడు. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 18 బంతుల్లో అర్ధ శతకం బాదాడు. పంజాబ్ కింగ్స్ జట్టులో యువ ఆటగాళ్లు, విదేశీ ప్లేయర్లు ఫాస్టెస్ట్ హాఫ్‌ సెంచరీతో మ్యాచ్‌లను మలుపుతిప్పుతున్నారు. భవిష్యత్తులో ఈ జాబితాలో మరిన్ని పేర్లు చేరే అవకాశాలు లేకపోలేదు.