Prabhsimran Singh: టెన్షన్ వద్దు, ప్లేఆఫ్స్‌కు చేరుతాం.. అభిమానులకు పంజాబ్ ప్లేయర్ భరోసా!
- వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న పంజాబ్
- ప్లేఆఫ్స్ రేసులో వనకపడిపోయిన పీబీకేఎస్
- అభిమానులకు పంజాబ్ ప్లేయర్ ప్రభ్సిమ్రాన్ భరోసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అనూహ్యంగా వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోంది. సీజన్ ప్రారంభంలో తొలి ఏడు మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్లిన పీబీకేఎస్.. ఇప్పుడు వరుస ఓటములు చవిచూసి ప్లేఆఫ్స్ రేసులో వనకపడిపోయింది. నాలుగు ఓటములు ఎదురయినప్పటికీ పంజాబ్ ఇంకా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధిస్తే.. ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతుంది. వరుస పరాజయాల నేపథ్యంలో పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ అభిమానులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. టెన్షన్ వద్దని, తప్పకుండా ప్లేఆఫ్స్‌కు చేరుతాం అని ధీమా వ్యక్తం చేశాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పంజాబ్ కింగ్స్ విడుదల చేసిన వీడియోలో ప్రభ్సిమ్రాన్ సింగ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు. ‘మేము వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయాం. కానీ ఇప్పటికీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నాం. మేము ఖచ్చితంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి ట్రోఫీ గెలుస్తాం. మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ధర్మశాలను రెడ్ కలర్‌తో నింపేయండి. ముంబై ఇండియన్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్ మాకు చాలా కీలకం. ఆ మ్యాచ్ గెలిచి మళ్లీ కంబ్యాక్ చేస్తాం’ అని ప్రభ్సిమ్రాన్ ధీమా వ్యక్తం చేశాడు.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
ఈ సీజన్లో ప్రభ్సిమ్రాన్ సింగ్ పంజాబ్ కింగ్స్ తరఫున అద్బుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 382 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే గత మూడు మ్యాచ్‌ల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. గుజరాత్ టైటాన్స్‌పై15 పరుగులు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 3 పరుగులు, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 18 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పంజాబ్ జట్టుకు సరైన ఆరంభాలు లేకుండా పోయాయి.
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 ఓటములు, ఒక నో రిజల్ట్‌తో మొత్తం 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా పట్టికలో పంజాబ్ జట్టుకు చాలా దగ్గరగా ఉండటంతో ప్లేఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠగా మారింది. తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోతే.. పంజాబ్ టాప్-4 నుంచి బయటకు వెళ్లే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ముంబైతో జరగబోయే మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌కు కీలకంగా మారింది. వరుస పరాజయాల తర్వాత జట్టు ఎలా కంబ్యాక్ చేస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
తాజావార్తలు
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!