PBKS vs MI: అతడు మమ్మల్ని భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya on Ashutosh Sharma: పంజాబ్ కింగ్స్ బ్యాటర్ అషుతోష్ శర్మపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రశంసలు కురిపించాడు. అషుతోష్ తన అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడని, ప్రతీ బంతిని బాది తమని భయపెట్టాడన్నాడు. ఇదో అద్భుతమైన మ్యాచ్ అని, అందరూ ఉత్కంఠకు గురయ్యారని హార్దిక్ తెలిపాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి నాలుగు ఓవర్లలో 28 పరుగులు చేయాల్సిన స్థితిలో పంజాబ్ సంచలన విజయం సాధించేలా కనిపించినా.. ఆఖర్లో పుంజుకున్న ముంబై అనూహ్య విజయాన్ని అందుకుంది.
మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ… ‘ఇది అద్భుత మ్యాచ్. ప్రతిఒక్కరు ఉత్కంఠకు గురయ్యారు. ఈ మ్యాచ్ ప్రతీ ఒక్కరి సత్తాకు పరీక్షగా నిలుస్తుందని మ్యాచ్‌కు ముందే చెప్పా. సహజంగా మ్యాచ్‌లో మనమే ముందున్నామని అనుకుంటాం. కానీ టీ20ల్లో మ్యాచ్ ఎప్పుడూ ఎలా టర్న్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. విజయం సాధించే వరకు నమ్మకంగా ఉండలేం. అందుకే అప్రమత్తంగా ఉండాలి’ అని అన్నాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Rohit Sharma: ఆ రోజు చాలా భయపడ్డాను: రోహిత్ శర్మ
‘అషుతోష్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆ పరిస్థితుల్లో వచ్చి ప్రతీ బంతిని బాదాడు. నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. అషుతోష్ ఆట పట్ల సంతోషంగా ఉంది. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. టైమ్ ఔట్లో మేం ఒకటే విషయం మాట్లాడుకున్నాం. చివరి వరకు అప్రమత్తంగా ఉండాలనుకున్నాం. కొన్ని ఓవర్లలో భారీగానే పరుగులిచ్చాం. ఏది ఏమైనప్పటికీ విజయం సాధించడం ఆనందంగా ఉంది. వచ్చే మ్యాచ్‌లలో మంచి ప్రదర్శన చేస్తాం’ అని హార్దిక్ పాండ్యా చెప్పాడు.
తాజావార్తలు
-
Redmi Smart Phone: 1.5K AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
-
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
-
Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
-
KTR : రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్..
-
Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!