How Mumbai Indians Qualify For IPL 2024 Play-Offs: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మరో ఓటమిని చవిచూసింది. సోమవారం జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఘోర ఓటమిని ఎదుర్కొంది. యశస్వి జైస్వాల్ (60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 104 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగి రాజస్థాన్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ(65) హాఫ్ సెంచరీ చేశాడు. ఆపై రాజస్థాన్ 18.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 183 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది.
ముంబై ఇండియన్స్‌పై విజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన ఆరు మ్యాచ్‌లలో రెండు గెలిస్తే.. అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. ఒక విజయం సాధించినా రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కు వెళుతుంది. మరోవైపు తాజా పరాజయంతో ముంబై తమ ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై 3 విజయాలతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
Also Read: Nani: ఆ సినిమా ఎవరితో చేస్తారో చేసుకోండి.. నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ 6 మ్యాచ్‌లు గెలవాలి. ఒక్కదాంట్లో ఓడినా.. ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఉంటాయి. అయితే అప్పుడు రన్‌రేట్ కీలకంగా మారుతుంది. రెండు ఓడితే మాత్రం ప్లేఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సిందే. ప్రస్తుతం ముంబై ఫామ్ చూస్తుంటే 5 మ్యాచ్‌ల్లో గెలవడం దాదాపు అసాధ్యమే. సంచనాలు నమోదైతే తప్ప ముంబై ప్లేఆఫ్స్ చేరదు. ముంబై తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఢిల్లీ, లక్నో, కోల్‌కతా, హైదరాబాద్, కోల్‌కతా, లక్నోతో ఆడాల్సి ఉంది. ఢిల్లీ తప్ప మిగతా మూడు జట్లు ఫామ్ మీదున్న విషయం తెలిసిందే.