Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు!
- ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన
- ఐపీఎల్ చరిత్రలోనే ముంబై అరుదైన చెత్త రికార్డు
- ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీలో మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై.. ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన చెత్త రికార్డును కూడా తన పేరిట నమోదు చేసుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లతో బరిలోకి దిగిన రెండో జట్టుగా ముంబై నిలిచింది. ఈ జాబితాలో గతంలో పుణే వారియర్స్ ఇండియా మాత్రమే ఉంది. అప్పట్లో రాస్ టేలర్, ఏంజెలో మాథ్యూస్, ఆరోన్ ఫించ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ వహించారు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ముంబైకి నాయకత్వం వహించడం గమనార్హం.
హార్దిక్ పాండ్యా గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమవడంతో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీలో మార్పులు చోటుచేసుకున్నాయి. హార్దిక్ గాయం కారణంగా ఒక మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించాడు. సూర్యకు కూతురు జన్మించడంతో.. మరో మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ మళ్లీ జట్టులోకి వచ్చి కెప్టెన్సీ అందుకున్నాడు. అయితే కెప్టెన్ మారినా ముంబై పరిస్థితి మాత్రం మారలేదు.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులే చేసింది. ప్రారంభం నుంచే ముంబై బ్యాటర్లు తీవ్ర ఒత్తిడిలో కనిపించారు. ర్యాన్ రికెల్టన్ (6), నమన్ ధీర్ (0), రోహిత్ శర్మ (15), సూర్యకుమార్ యాదవ్ (15)లు నిరాశపర్చారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి ముంబై 46/4తో కష్టాల్లో పడింది. తిలక్ వర్మ (20), హార్దిక్ పాండ్యా (26) రాణించలేదు. చివర్లో కార్బిన్ బోష్ 18 బంతుల్లో అజేయంగా 32 పరుగులు చేసి జట్టును గౌరవప్రదమైన స్కోర్‌కు చేర్చాడు. దాంతో ముంబై ఈ సీజన్లో మరోసారి నిరాశపరిచింది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..