Captain Hardik Pandya on Mumbai Indians Defeat: ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి కారణం అని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. నేహాల్ వధేరా సూపర్ బ్యాటింగ్‌తో పోరాడే లక్ష్యాన్ని అందించినా.. తమ విజయానికి సరిపోలేదన్నాడు. తాము పుంజుకుంటామని ఎప్పుడూ నమ్ముతానని, కమ్ బ్యాక్ చేయాలంటే సాయశక్తులా పోరాడాలని హార్దిక్ చెప్పాడు. ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ సేన 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
Also Read: Salman Khan Firing Case: సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో కొత్త ట్విస్ట్.. అక్కడి నుంచే అంతా?
మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ… ‘ఇన్నింగ్స్ ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోతే పుంజుకోవడం చాలా కష్టం. ఈరోజు మాకు అదే జరిగింది. బంతిని చూసి హిట్ చేయాలి. మేం మిస్ చేసుకున్న బంతులే మమ్మల్ని ఔట్ చేశాయి. ఈ సీజన్ మొత్తం మాకు ఇలానే జరిగింది. మేం పుంజుకుంటామని నేను ఎప్పుడూ నమ్ముతాను. టోర్నీలో కమ్ బ్యాక్ చేయాలంటే పోరాడాలి. ఈ మ్యాచ్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. నేహాల్ వధేరా గతేడాది కూడా బాగా ఆడాడు. ఐపీఎల్ 2024 ఆరంభంలో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. భవిష్యత్తులో వధేరా చాలా ఐపీఎల్ మ్యాచులు ఆడుతాడు. టీమిండియాకు కూడా ప్రాతినిథ్యం వహిస్తాడు’ అని అన్నాడు.