NTV Telugu Site icon

Mohammed Siraj: ఐపీఎల్ పైనే ఫోకస్.. అవేమీ ఆలోచించను

Mohammed Siraj

Mohammed Siraj

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక కాకపోయినా.. తన ప్రదర్శనపై దృష్టి సారించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆర్సీబీ జట్టులో 7 సంవత్సరాల పాటు ఆడిన ఫాస్ట్ బౌలర్.. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడనున్నాడు. తన కొత్త జట్టుకు మెరుగైన ప్రదర్శన అందించేందుకు రెడీ అవుతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత సిరాజ్ ఐపీఎల్ 2025 సీజన్‌లోకి అడుగుపెట్టనున్నాడు. జూన్ 20 నుండి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ పర్యటన.. సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్‌కు ముందు టీమిండియాలో స్థానం సంపాదించడం కోసం ఐపీఎల్ ఆదర్శంగా ఉంటుందని సిరాజ్ తెలిపాడు. ఈ సీజన్‌లో తన కొత్త ఫ్రాంచైజీకి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపై దృష్టి పెడుతానని అన్నాడు.

Read Also: Murder : రంగారెడ్డి జిల్లాలో దారుణం.. మద్యం కోసం భార్యను హత్య చేసిన భర్త

సిరాజ్ తన ఎంపికపై స్పందిస్తూ.. “సెలెక్షన్ నా చేతుల్లో లేదు, నా చేతుల్లో కేవలం బాల్ మాత్రమే ఉంది. నేను ఏదైనా చేయాలనుకుంటే దాంతోనే చేయాలి. ఇతర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి, నాపై నేను ఒత్తిడి పెంచుకోలేను” అని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 సీజన్‌ కోసం సిరాజ్.. తన ఫిట్‌నెస్, బౌలింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి విరామ సమయంలో కృషి చేశాడు. హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుని.. కొత్త బంతితో పాటు పాత బంతితోనూ మరింత ప్రభావవంతంగా బౌలింగ్ చేయడంపై దృష్టిపెట్టాడు.

Read Also: Ranbir Kapoor : ఆమెనే నా మొదటి భార్య.. బాంబు పేల్చిన రణ్‌బీర్

ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌లో మహమ్మద్ సిరాజ్.. కగిసో రబడ, ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, గెరాల్డ్ కోయెట్జీలతో కూడిన బలమైన పేస్ అటాక్‌లో చేరనున్నాడు. షమీ స్థానంలో రావడం గురించి సిరాజ్ మాట్లాడుతూ.. భారత్, గుజరాత్ టైటాన్స్ రెండింటికీ అతను అందించిన సహకారాన్ని ప్రశంసించాడు. “షమీ భాయ్ టీమిండియా, గుజరాత్ టైటాన్స్ కోసం చాలా చేసాడు. అతని మణికట్టు, సీమ్ పొజిషన్‌తో పాటు స్వింగ్‌ను సృష్టించే సామర్థ్యం సాటిలేనిది” అని సిరాజ్ అన్నాడు. ” నా పని కూడా జట్టుకు వికెట్లు అందించడమే. నా సామర్థ్యంపై నాకు నమ్మకం ఉంది.” అని సిరాజ్ మియా తెలిపాడు. కాగా.. గుజరాత్ టైటాన్స్ తమ మొదటి మ్యాచ్ మార్చి 25 (మంగళవారం) అహ్మదాబాద్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది.