MI vs CSK: రోహిత్, ధోనీ ఆడతారా?.. ముంబై-చెన్నై మ్యాచ్‌కు ముందు కీలక అప్‌డేట్!
- ఈరోజు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్
- ముంబై-చెన్నై మ్యాచ్‌కు ముందు కీలక అప్‌డేట్
- టాస్ సమయానికే క్లారిటీ వచ్చే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వాంఖడే మైదానంలో ఈరోజు రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ కీలక మ్యాచ్‌లో దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలు ఆడుతారో లేదో అన్న అనిశ్చితి నెలకొంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్‌కు ముందు ఇద్దరు స్టార్ ప్లేయర్ల అందుబాటుపై ఓ కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది.
ముంబై ఇండియన్స్ మీడియా మేనేజర్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే విషయంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని చెప్పాడు. టాస్‌కు ముందు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రోహిత్ ఇప్పటికే మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడని తెలుస్తోంది. మరోసారి అతడి ఫిట్‌నెస్ పరిస్థితిని అంచనా వేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోనున్నారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ గాయపడిన పడిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో రోహిత్ 78, 35, 5, 19 పరుగులు చేశాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఎంఎస్ ధోనీ ఆడే విషయంపై ఇంకా స్పష్టత లేదు. సీఎస్‌కే బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ మాట్లాడుతూ.. ధోనీ స్వయంగా, టీమ్ మెడికల్ సిబ్బంది కలిసి ఈరోజు తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ధోనీ పూర్తిగా ఫిట్‌గా ఉంటేనే మైదానంలోకి దిగుతాడని ఆయన పేర్కొన్నారు. ఈ సీజన్‌లో ధోనీ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడని విషయం తెలిసిందే. రోహిత్, ధోనీ ఇద్దరూ ఈరోజు మ్యాచ్‌లో ఆడతారా లేదా అన్నది టాస్ సమయానికే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు లెజెండ్స్ మైదానంలోకి దిగుతారని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!