Site icon NTV Telugu

IPL 2024: పతిరణ స్టన్నింగ్ క్యాచ్.. గాల్లో ఎగిరి మరీ..!

Pathirana

Pathirana

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విశాఖ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన.. డేవిడ్ వార్నర్ (52), పృథ్వీ షా (43) మంచి ఇన్నింగ్స్ ఆడారు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో.. వార్నర్ క్యాచ్ మతిషా పతిరణకు క్యాచ్ ఇచ్చాడు.

Read Also: IPL 2024: రషీద్ ఖాన్ మరో అరుదైన ఘనత.. ఆ రికార్డు బ్రేక్

ముస్తాఫిజుర్ బౌలింగ్ లో డేవిడ్ వార్నర్ రివర్స్ స్వీప్ ఆడారు. కానీ.. అక్కడే ఉన్న పతిరణ పక్షిలా గాల్లోకి ఎగురుతూ క్యాచ్ అందుకున్నాడు. కాసేపు వార్నర్ కూడా ఆ క్యాచ్ ను నమ్మలేక నిలబడిపోయారు. నమ్మశక్యం కానీ క్యాచ్‌ను చూసి కొద్దిసేపు క్రీజును వదలకుండా అక్కడే నిలబడిపోయాడు. చివరకు ఔటయ్యననే విషయాన్ని గ్రహించి భారంగా మైదానం వీడాడు. ఇందుకు సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్‌కు ఇదే మొదటి హాఫ్ సెంచరీ.

Read Also: Chandrababu: మా పొత్తుతో జగన్‌కు నిద్రపట్టడం లేదు..

ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ తమ మూడో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడుతుంది. ఇంతకు ముందు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై విజయం సాధించింది. కాగా.. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్ విజయాలు సాధించాలని చెన్నై భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో, రెండో మ్యాచ్‌లో గుజరాత్‌పై 63 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది.

Exit mobile version