LSG vs CSK: ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా మార్కస్ స్టొయినిస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marcus Stoinis is the highest-ever score in an IPL Chase: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్నో విజయంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 124 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సెంచరీ చేసిన స్టొయినిస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
అజేయ సెంచరీ చేసిన మార్కస్ స్టొయినిస్ 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే విజయవంతమైన రన్ ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు పంజాబ్ కింగ్స్ ఆటగాడు పాల్ వాల్తాటి పేరిట ఉంది. 2011లో చెన్నైపైనే లక్ష్య చేధనలో వాల్తాటి 120 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో 124 పరుగులు చేసిన స్టొయినిస్ వాల్తాటి రికార్డును బద్దలు కొట్టాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Sunitha Mahender Reddy: పండుగలతోనే ప్రజల మధ్య ఐక్యమత్యం: సునీత మహేందర్ రెడ్డి
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (108 నాటౌట్; 60 బంతుల్లో 12×4, 3×6) సెంచరీ చేయగా.. శివమ్ దూబె (66; 27 బంతుల్లో 3×4, 7×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మార్కస్ స్టాయినిస్ అజేయ శతకంతో చెలరేగగా.. నికోలస్ పూరన్ (34; 15 బంతుల్లో 3×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్‌డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!