Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
- ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం
- లియామ్ లివింగ్‌స్టోన్ సంచలన వ్యాఖ్యలు
- ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liam Livingstone Alleges SRH Owners Over Playing 11: ‘ఐపీఎల్లో జట్టు యజమానులు ఆటగాళ్ల ఎంపికలో జోక్యం చేసుకుంటారా?’.. అనే ప్రశ్నకు సంవత్సరాలుగా స్పష్టమైన సమాధానం దొరకలేదు. అయితే తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మాజీ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. ఐపీఎల్ 2026 సీజన్లో తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడిస్తూ.. జట్టు యజమానుల అభిప్రాయం కూడా తుది జట్టు ఎంపికపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన స్టార్ ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్ ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్ తరఫున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ రెండు మ్యాచ్‌ల్లో 1, 14 పరుగులు చేశాడు.
తాజాగా ఒక క్రికెట్ పోడ్కాస్ట్లో మాట్లాడిన లియామ్ లివింగ్‌స్టోన్.. తాను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్థానం కోల్పోవడానికి ప్రధాన కారణం యజమానులకు ఇష్టమైన ఓ ఆటగాడే అని చెప్పాడు. ‘వేలంలో ముంబై ఇండియన్స్ ఎంతో ఆసక్తిగా కోరుకున్న సలీల్ అరోరాను మేము ఎక్కువ డబ్బు పెట్టి కొనుగోలు చేశాం. యజమానులకు అతను చాలా నచ్చాడు. అందుకే అతనికి జట్టులో స్థానం దాదాపు ఖాయమైంది. పాట్ కమిన్స్ అందుబాటులో లేని సమయంలో కూడా మేము కేవలం ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే ఆడుతున్నాం. అప్పుడు నేను కోచ్ డేనియల్ వెటోరిని అడిగాను. నాలుగో విదేశీ ఆటగాడిగా నన్నెందుకు ఆడించడం లేదని’ అని లివింగ్‌స్టోన్ వివరించాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
తన ప్రశ్నకు కోచ్ డేనియల్ వెటోరి ఇచ్చిన సమాధానం అక్కడి పరిస్థితిని స్పష్టంగా అర్థమయ్యేలా చేసిందని లియామ్ లివింగ్‌స్టోన్ తెలిపాడు. ‘యజమానులకు ఆ ఆటగాడు (సలీల్ అరోరా) చాలా ఇష్టం. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తిరిగి వచ్చినా కూడా మా ప్రణాళికలో మార్పు ఉండదు’ అని వెటోరి చెప్పాడని లివింగ్‌స్టోన్ వెల్లడించాడు. దీంతో తనకు అవకాశం రావాలంటే ఎవరైనా గాయపడాల్సిందేనని అర్థమైందని, ఆ తర్వాత తన మానసిక పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పాడు. ఈ సందర్భంగా ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు డేవిడ్ లాయిడ్ ‘ఈ యజమానులకు జట్టు ఎంపిక గురించి ఎంత అవగాహన ఉంటుంది?’ అని ప్రశ్నించగా.. మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ ‘వారి దగ్గర చాలా డబ్బు ఉంటుంది’ అని సరదాగా సమాధానం ఇచ్చాడు. దీనికి స్పందించిన లివింగ్‌స్టోన్ .. ‘యజమానులు పూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారో లేదో తెలియదు. కానీ వారికి తప్పకుండా ఓ మాట ఉంటుంది. అయితే వెటోరి పరిస్థితిని నాతో నిజాయితీగా చెప్పడం నాకు నచ్చింది’ అని అన్నాడు.
కావ్య మారన్ సహ యజమానిగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2026లో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అయితే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. సలీల్ అరోరా 2026 ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 14 మ్యాచ్‌లలో 156 పరుగులు చేశాడు. లియామ్ లివింగ్‌స్టోన్ వ్యాఖ్యలు ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జట్టు ఎంపికలో యజమానుల పాత్ర ఎంత వరకు ఉండాలి? అనే అంశంపై మళ్లీ చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!