NTV Telugu Site icon

T20 World Cup 2024: శుభ్‌మన్ గిల్ అవసరమా.. సెలక్టర్లు ఆసక్తి ఏంటో అర్ధం కావడం లేదు!

Ruturaj Gaikwad

Ruturaj Gaikwad

Krishnamachari Srikkanth Slams BCCI Over T20 World Cup 2024 Squad: టీ20 ప్రపంచకప్‌ 2024 కోసం ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను రిజర్వ్‌ ప్లేయర్‌గా తీసుకోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత క్రిష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డారు. ఫామ్‌లో లేని గిల్ రిజర్వ్‌ ప్లేయర్‌గా అవసరమా? అని ప్రశ్నించాడు. ఐపీఎల్ 2024లో అద్భుతంగా ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్‌ను జట్టులోకి ఎంచుకుంటే బాగుండేదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. పీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం రుతురాజ్‌ వద్దే ఉంది. 10 మ్యాచ్‌లలో 146.68 స్ట్రైక్ రేట్‌తో 509 పరుగులు చేశాడు. గిల్ 320 రన్స్ చేశాడు.

భారత ఓపెనర్లలో శుభమన్ గిల్ (320), రోహిత్ శర్మ (315), యశస్వి జైస్వాల్ (249) కంటే రుతురాజ్‌ గైక్వాడ్‌ ఎక్కువ పరుగులు చేశాడు. అయినప్పటికీ టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకోవడంలో గైక్వాడ్ విఫలమయ్యాడు. టాప్ ఆర్డర్‌లో రోహిత్, యశస్వి, విరాట్ కోహ్లీ ఎంపిక కాగా.. గిల్ రిజర్వ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2024లో పరుగుల వరద పారిస్తున గైక్వాడ్‌ను విస్మరించిన బీసీసీఐపై క్రిష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డారు. శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘శుభ్‌మన్ గిల్ ఫామ్‌లోనే లేడు. అసలు అతడిని ఎందుకు ఎంపిక చేశారు. రుతురాజ్‌ గైక్వాడ్‌కు పూర్తి అర్హుడు’ అని అన్నారు.

Also Read: CSK vs PBKS: వికెట్లు తీయాలనే లక్ష్యంతో బరిలోకి దిగను: హర్‌ప్రీత్

‘భారత్ తరఫున రుతురాజ్‌ గైక్వాడ్‌ 17 ఇన్నింగ్స్‌ల్లో 500 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై సెంచరీ బాదాడు. అయితే శుభ్‌మన్ గిల్‌ పట్ల బీసీసీఐ సెలక్టర్లు ఆసక్తి చూపడానికి కారణమేంటో నాకు తెలియడం లేదు. అతడు విఫలమైనా సరే టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అవకాశం దక్కుతుంది. అంటే జట్టు ఎంపిక అంతా అభిమానంతో కూడుకున్నట్లుగా ఉంది’ అని శ్రీకాంత్ ఫైర్ అయ్యారు. రిజర్వ్‌ ప్లేయర్‌గా గిల్ సహా రింకు సింగ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

Show comments