Site icon NTV Telugu

Virat Kohli In Trouble: విరాట్ కోహ్లీపై ఫిర్యాదు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్

Virat

Virat

Virat Kohli In Trouble: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు విరాట్ కోహ్లీనే ప్రధాన కారణమని కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అతడి ఫిర్యాదుపై స్పందించిన కబ్బన్ పార్క్ పోలీసులు.. ఈ ఫిర్యాదును ఇప్పటికే నమోదైన కేసు కింద పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. తొక్కిసలాట సంఘటనపై జరుగుతున్న విచారణలో భాగంగా పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు.

Read Also: PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

అయితే, ఈ తొక్కిసలాటకు కారణం ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యమేనని వెంకటేష్ ఫిర్యాదులో తెలిపారు. ముఖ్యంగా ఉచిత పాస్‌లు, ప్లేయర్స్ ను కలిసే అవకాశం కల్పిస్తామని చేసిన ప్రకటనతో లక్షలాది మంది ఫ్యాన్స్ ఒక్కసారిగా స్టేడియం వద్దకు చేరుకున్నారని ఆయన ఆరోపించారు. జట్టులో కీలక ఆటగాడిగా, ప్రజల్లో విస్తృతమైన ఆదరణ కలిగిన విరాట్ కోహ్లీ, ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్రకటనలలో భాగస్వామ్యం వహించాడు.. కాబట్టి ఈ తొక్కిసలాటకు అతను కూడా బాధ్యుడే అని ఫిర్యాదులో వెల్లడించాడు.

Read Also: Asian Sunil : రేపు ఏషియన్ సునీల్ ప్రెస్ మీట్.. కీలక విషయాలు మాట్లాడే ఛాన్స్..?

ఇక, పోలీసులు ఇప్పటికే ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ DNA ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్లపై కేసు నమోదు చేశారు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేతో సహా నలుగురు అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు.

Exit mobile version