PhonePe: ఫీచర్ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PhonePe: ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే (PhonePe) ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపు సేవల్ని ప్రవేశపెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం జీఎస్ పే టెక్నాలజీకి చెందిన కన్వర్సేషనల్ ఎంగేజ్మెంట్ ప్లాట్‌ఫారమ్ ‘గప్ చుప్’ను ఫోన్‌పే ఇటీవలే కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది.
ఫోన్‌పే వెల్లడించిన ప్రకారం, రానున్న త్రైమాక్షికలో భారత్ లోని ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యూపీఐ మొబైల్ యాప్ ను విడుదల చేయనున్నది. ఈ యాప్ ద్వారా పీర్-టు-పీర్ (P2P) లావాదేవీలు, ఆఫ్ లైన్ క్యూఆర్ కోడ్ చెల్లింపులు, ఇతర యూపీఐ వినియోగదారుల నుండి మొబైల్ నంబర్ లేదా యూపీఐ ఐడీ ఆధారంగా చెల్లింపులు స్వీకరించగలుగుతారు.
Also Read
Read Also: Carlos Alcaraz: ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లోకి కార్లోస్ ఆల్కారాజ్ ఎంట్రీ..!
ఈ సేవలు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన యూపీఐ 123పే ఆధారంగా పనిచేసే జీఎస్ పే (GS Pay) టెక్నాలజీ ద్వారా అందించనున్నారు. ఫీచర్ ఫోన్లకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ టెక్నాలజీ ద్వారా యూపీఐ చెల్లింపులు మరింత విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం నోకియా సంస్థ తయారు చేసిన కొన్ని ఫీచర్ ఫోన్లలో గప్ చుప్ యాప్ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఈ యాప్‌లో ఎస్‌ఎంఎస్ ఆధారంగా బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను అనుసంధానించొచ్చు. అనంతరం ‘పే’ ఆప్షన్ ద్వారా యూజర్లు యూపీఐ ఐడీ లేదా మొబైల్ నంబర్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఇదే యాప్ స్థానంలో ఫోన్‌పే సరికొత్త యాప్ ను త్వరలో అందించనుంది.
Read Also: Minister Ramanaidu: ఆ అంశంలో తెలంగాణ సహకరించాలి.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..!
స్మార్ట్ ఫోన్ల వినియోగదారులకే పరిమితంగా ఉండకుండా ఫోన్‌పే ఈ నిర్ణయం తీసుకున్నదాని వెనుక లక్ష్యం. ఫీచర్ ఫోన్ వాడుతున్న ప్రజలకు కూడా డిజిటల్ చెల్లింపు వేదికలను అందించడమే. ఈ మేరకు ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ సమీర్ నిగమ్ మాట్లాడుతూ.., “డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ఇది ఒక కీలక అడుగని తెలిపారు. ఈ కొత్త యాప్‌తో ఫీచర్ ఫోన్ వినియోగదారులకూ యూపీఐ ఆధారిత చెల్లింపులు, లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?