Virat Kohli In Trouble: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు విరాట్ కోహ్లీనే ప్రధాన కారణమని కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.