KL Rahul: నా ప్లాన్ రివర్స్ అయింది.. అయినా నాకు సంతోషమే!
- ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ
- 226 పరుగుల లక్షాన్ని ఛేజ్ చేసిన ఢిల్లీ
- 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా కేఎల్ రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) గ్రాండ్ విక్టరీ కొట్టింది. రాజస్థాన్ నిర్ధేశించిన 226 పరుగుల లక్షాన్ని ఢిల్లీ ఛేదించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ మెరుపులు మెరిపించాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 70 రన్స్ చేశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన రాహుల్ తన ఇన్నింగ్స్‌పై, జట్టు ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగత గణాంకాల కంటే జట్టు విజయం ముఖ్యమని స్పష్టం చేశాడు. ఎంత మంచి ఇన్నింగ్స్ ఆడినా జట్టు గెలవకపోతే ఆ ఆనందం ఉండదని, విజయం వచ్చినప్పుడే నిజమైన సంతృప్తిని ఇస్తుందని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇటీవల రాహుల్ 152 పరుగుల ఇన్నింగ్స్ ఆడినా.. డిల్లీ ఓడిపోయిన విషయం తెలిసిందే.
‘విజయం మరింత మధురంగా అనిపిస్తుంది. ఏ ప్లేయర్ అయినా మ్యాచ్ గెలవడానికి ఆడుడు. ఎన్నో సంవత్సరాలు ఆడిన తర్వాత గణాంకాలు కూడా ముఖ్యమే. మంచి పరుగులు చేయడం, రికార్డులు బద్దలు కొట్టడం సంతోషమే. కానీ మ్యాచ్ గెలవకపోతే ఆ ఆనందం ఉండదు. మా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఎప్పుడూ బాగా ఉంటుంది. అలానే ఉంచడానికి మేము ప్రయత్నిస్తాం. ఫలితాలు మనకు అనుకూలంగా రాకపోయినా.. లోతుగా పరిశీలిస్తే పెద్ద తప్పులు చేశామనే భావన లేదు. మేము డ్రెస్సింగ్ రూమ్‌లో నిజాయితీగా మాట్లాడుకున్నాం. కొన్ని కీలక సందర్భాలను ఉపయోగించుకోలేకపోయాం. గత మ్యాచ్ తప్ప మిగతా ప్రతి మ్యాచ్‌లో మేము పోటీలోనే ఉన్నాం. ఒక్క ఓవర్ మనకు అనుకూలంగా మారి ఉంటే ఫలితం మారేదే. మేము మంచి క్రికెట్ ఆడామని తెలుసు, కానీ కొన్ని విషయాల్లో ఇంకా మెరుగుపడాల్సి ఉంది’ అని లోకేష్ రాహుల్ చెప్పాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
‘టీ20 క్రికెట్‌లో రెండో అవకాశం ఉండదు. అందుకే వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడం చాలా ముఖ్యం. ముందంజలో ఉన్నప్పుడు మ్యాచ్‌ను ముగించాల్సింది, అది మేము చేయలేకపోయాం. ఇప్పుడు ఈ విజయం చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి వరుస విజయాలు సాధించాలని చూస్తున్నాం. అది మాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. నా ఇన్నింగ్స్ పట్ల చాలా ఆనందంగా ఉంది. పవర్‌ప్లేలో మరికొన్ని బంతులు ఆడాలనుకున్నాను. కానీ పాథుమ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దాంతో నేను మరో ఎండ్‌లో నిలబడి అతని ఆటను ఆస్వాదించాను. నా ప్లాన్ రివర్స్ అయినా సంతోషమే. పాథుమ్ ఆడిన విధానం మమ్మల్ని మ్యాచ్‌లో ముందంజలో ఉంచింది. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడాలనుకున్నాం, అతను అదే చేశాడు. మేమిద్దరం ఎక్కువగా మాట్లాడుకోం. కానీ సరైన షాట్లు ఆడుతూ, పవర్‌ప్లేను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఒకరికి ఒకరు గుర్తుచేసుకుంటాం. అతను ఈ సీజన్‌లో బాగా ఆడుతున్నాడు కానీ 40ల వద్ద ఆగిపోయాడు. ఇప్పుడు హాఫ్ సెంచరీ సాధించడం అతనికి మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇక నుంచి జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తాడని ఆశిస్తున్నాను. నా స్ట్రైక్‌రేట్ గురించి గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద చర్చగా మారింది. జట్టుకు అవసరమైన విధంగా, ఆధునిక టీ20 క్రికెట్‌కు తగ్గట్టు ఆడుతున్నాను. అది నాకు చాలా సంతోషంగా ఉంది’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
-
Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
-
MLA Bonda Uma: సిద్ధార్థకు అవకాశం ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బోండా ప్రత్యేక విజ్ఞప్తి!
-
Irumudi 2: రామ్ చరణ్‌తో ‘ఇరుముడి 2’?.. అసలు విషయం చెప్పేసిన శివ నిర్వాణ!
-
UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!