Jos Buttler Breaks Virat Kohli’s Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చేజింగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా బట్లర్ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకం బాది ఈ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో బట్లర్‌కు ఇది ఏడో సెంచరీ కాగా.. చేజింగ్‌లో మూడోది. రాజస్థాన్ నిర్ధేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని బట్లర్ శతకంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌కు ముందువరకు ఐపీఎల్ చేజింగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి జోస్ బట్లర్ (2) సమానంగా ఉన్నాడు. తాజా సెంచరీతో బట్లర్ కోహ్లీని వెనక్కి నెట్టి అగ్ర స్థానంలోకి వచ్చాడు. ఈ జాబితాలో బెన్ స్టోక్స్ (2) మూడో స్థానంలో ఉన్నాడు. అయితే ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు (7) నమోదు చేసిన రెండో బ్యాటర్‌గా బట్లర్ నిలిచాడు. 8 శతకాలతో కోహ్లీ (8) మొదటి స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2024లో ఇప్పటికే బట్లర్ రెండు శతకాలు బాదాడు.
Also Read: Shreyas Iyer: ఈ ఓటమిని ఊహించలేదు.. చాలా బాధగా ఉంది: శ్రేయస్ అయ్యర్
మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్‌పై జోస్ బట్లర్‌కు ఇది రెండో సెంచరీ. దాంతో ఒకే జట్టుపై ఎక్కువ సెంచరీలు చేసిన జాబితాలో బట్లర్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్‌పై 3 సెంచరీల చేసిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అగ్ర స్థానంలో ఉన్నాడు. కేకేఆర్, ఆర్‌సీబీలపై బట్లర్ రెండేసి శతకాలు చేశాడు. బట్లర్ ఫామ్ చూస్తే.. మరో సెంచరీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ 6 విజయాలతో 12 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. మిగతా 7 మ్యాచ్‌లలో కనీసం రెండు గెలిచినా.. ఆర్ఆర్ ప్లే ఆఫ్స్ చేరుతుంది.
