Jos Buttler Breaks Virat Kohli’s Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చేజింగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా బట్లర్ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకం బాది ఈ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో బట్లర్‌కు ఇది ఏడో సెంచరీ కాగా.. చేజింగ్‌లో మూడోది. రాజస్థాన్ నిర్ధేశించిన 224…