IPL Trophy: తొలి టైటిల్ కోసం ఎదురుచూపులు.. ఆర్సీబీనే కాదు, చెన్నై-ముంబైకి తప్పని నిరీక్షణ!
- అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్ ఐపీఎల్
- 45 రోజుల్లోనే టైటిల్‌ను కైవసం చేసుకున్న రాజస్థాన్
- టైటిల్ కోసం చెన్నై-ముంబైకి తప్పని నిరీక్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL Teams First Title Wait: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్. అలాంటి టాప్ టోర్నీలో ప్రతి ప్రాంచైజీ టైటిల్ గెలవాలని చూస్తోంది. ఇందుకోసం ప్రతి జట్టు తీవ్రంగా పోరాడుతుంది. అయితే కొన్ని జట్లు ప్రారంభంలోనే ట్రోఫీని అందుకోగా.. మరికొన్ని జట్లు సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. ఐపీఎల్ చరిత్రలో తొలి టైటిల్ గెలవడానికి జట్లు తీసుకున్న రోజుల సంఖ్య చూస్తే.. ఆసక్తికరమైన గణాంకాలు ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
ఐపీఎల్ తొలి సీజన్ 2008లోనే రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో టైటిల్ అందుకుంది. రాజస్థాన్ కేవలం 45 రోజుల్లోనే టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఐపీఎల్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ కూడా 64 రోజుల్లోనే తమ తొలి ట్రోఫీని అందుకుంది. ఇక డెక్కన్ చార్జర్స్ 401 రోజుల్లో టైటిల్ సాధించింది. ఇక ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌కు కూడా కొంత నిరీక్షణ తప్పలేదు. 737 రోజులు తర్వాత చెన్నై తమ తొలి టైటిల్ అందుకుంది. చెన్నై 2008లో ఫైనల్ చేరినా.. ఫైనల్లో ఓడిపోయింది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ 1153 రోజులు ఎదురుచూసి.. 2016లో ట్రోఫీ గెలుచుకుంది. 2013లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్.. మూడో ఏడాదిలో కప్ అందుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ మొదటి కప్ అందుకోవడానికి 1499 రోజులు పట్టింది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ కూడా తొలి టైటిల్ కోసం 1864 రోజులు వేచి చూడాల్సి వచ్చింది. టాప్ జట్లకు కూడా ప్రారంభంలో టైటిల్ గెలవడం ఎంత కష్టమో ఈ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది.
Also Read: GT Closest Wins : గుజరాత్ టైటాన్స్ చరిత్రలోనే క్లోజ్ విక్టరీ.. థ్రిల్లర్ విజయాల్లో టాప్‌లో జీటీ!
ఈ జాబితాలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అంటే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల తర్వాత తొలి ట్రోఫీని అందుకుంది. ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. ఎట్టకేలకు 6255 రోజుల తర్వాత తొలి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది. మొత్తానికి ఈ గణాంకాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఐపీఎల్లో విజయం సాధించడం అంత సులభం కాదు. కొన్ని జట్లు తక్కువ సమయంలోనే చరిత్ర సృష్టిస్తే.. మరికొన్ని జట్లు ఏళ్ల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. ఇదే ఐపీఎల్ ప్రత్యేకత అని చెప్పాలి.
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..