GT Closest Wins : గుజరాత్ టైటాన్స్ చరిత్రలోనే క్లోజ్ విక్టరీ.. థ్రిల్లర్ విజయాల్లో టాప్‌లో జీటీ!
- అద్భుత ఆటతో గుజరాత్ ఎన్నో సంచలన విజయాలు
- జీటీ చరిత్రలోనే అత్యంత క్లోజ్ విక్టరీ
- థ్రిల్లర్ విజయాల్లో టాప్‌లో గుజరాత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ (జీటీ) తమ అద్భుత ఆటతో ఎన్నో సంచలన విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా అతి తక్కువ తేడాతో గెలిచిన మ్యాచ్‌లలో జీటీ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై నమోదైన విజయం ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో బుధవారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో జీటీ కేవలం ఒక పరుగుతో ఢిల్లీని ఓడించింది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ విజయం జీటీ చరిత్రలోనే అత్యంత క్లోజ్ విక్టరీగా నిలిచింది.
2024 సీజన్‌లో అహ్మదాబాద్‌లో ముంబై ఇండియన్స్‌పై 6 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలిచింది. ఇది జీటీకి రెండో క్లోజ్ విక్టరీగా నిలిచింది. 2023లో లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై 7 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. 2022లో ముంబై డీవైపీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ టీంపై 8 పరుగుల తేడాతో గెలిచింది. అదే సంవత్సరంలో పుణెలో మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్‌పై 14 పరుగుల తేడాతో విజయం అందుకుంది. ఇలా వరుసగా క్లోజ్ మ్యాచ్‌లలో గెలుస్తూ.. జీటీ తన సత్తాచాటింది. ఒత్తిడి పరిస్థితుల్లో కూడా కూల్ గేమ్ ఆడడం జీటీ విజయ రహస్యం అని చెప్పాలి.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
Also Read: DC 1 Run Defeats: ఢిల్లీ క్యాపిటల్స్‌కి శాపంగా మారిన ఒక్క పరుగు.. ఐపీఎల్‌లో చెత్త రికార్డ్!
గుజరాత్ టైటాన్స్ అతి తక్కువ పరుగులతో గెలిచిన మ్యాచ్‌లు:
# 1 రన్ vs ఢిల్లీ క్యాపిటల్స్, ఢిల్లీ, 2026
# 6 పరుగులు vs ముంబై ఇండియన్స్, అహ్మదాబాద్, 2024
# 7 పరుగులు vs లక్నో సూపర్ జెయింట్స్, లక్నో, 2023
# 8 పరుగులు vs కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై, 2022
# 14 పరుగులు vs ఢిల్లీ క్యాపిటల్స్, పూణే, 2022
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!